భారత్‌లో ఎల్ఎమ్ఎల్ స్టార్ యూరో 150 స్కూటర్ విడుదల
ఎల్ఎమ్ఎల్ స్కూటర్స్ గుర్తున్నాయా..? ఒకప్పుడు టూవీలర్ మార్కెట్లో సందడి చేసిన ఎల్ఎమ్ఎల్ స్కూటర్లు ఇప్పుడు రోడ్లపైకి రానున్నాయి. కాన్పూర్‌కు చెందిన పురాతన ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ లోహియా మెషీనరీ లిమిటెడ్ (ఎల్ఎమ్ఎల్) గడచిన సంవత్సరంలో భారత మార్కెట్లో తమ అప్‌గ్రేడెడ్ ఫ్రీడమ్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసిన సంగతి తెలిసినదే.
కాగా.. ఇప్పుడు అదే కంపెనీ ఓ కొత్త క్లాసిక్ లుకింగ్ 150సీసీ ఆటోమేటిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. 'ఎల్ఎమ్ఎల్ స్టార్ యూరో 150' (LML Star Euro 150) పేరిట కంపెనీ ఈ బైక్‌ను విడుదల చేసింది. ఫుల్ మెటల్ బాడీతో కూడిన భారతదేశపు తొలి 150సీసీ స్కూటర్ తమదేనని ఎల్ఎమ్ఎల్ పేర్కొంది. దేశీయ మార్కెట్లో దీని ధర రూ.54,014 (ఎక్స్-షోరూమ్, గుజరాత్)గా ఉంది.
ఎల్ఎమ్ఎల్ స్టార్ యూరో 150 ఆటోమేటిక్ స్కూటర్‌కు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

ఎల్ఎమ్ఎల్ స్టార్ యూరో 150 ఆటోమేటిక్ స్కూటర్‌లో 150సీసీ, సింగిల్ సిలిండర్, ఫోర్-స్ట్రోక్, ఫోర్డ్ ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 8000 ఆర్‌పిఎమ్ వద్ద 9 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ సివిట్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది.

ఎల్ఎమ్ఎల్ స్టార్ యూరో 150 ఆటోమేటిక్ స్కూటర్ గంటకు 90 కిలోమీటర్ల గరిష్ట వేగంతో పరుగులు తీస్తుంది.

ఎల్ఎమ్ఎల్ స్టార్ యూరో 150 ఆటోమేటిక్ స్కూటర్ లీటరు పెట్రోల్‌కు 55 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

ఎల్ఎమ్ఎల్ స్టార్ యూరో 150 ఆటోమేటిక్ స్కూటర్ 1760 మి.మీ. పొడవును, 695 మి.మీ. వెడల్పును, 820 మి.మీ. ఎత్తును మరియు 1260 మి.మీ. వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది.

ఎల్ఎమ్ఎల్ స్టార్ యూరో 150 ఆటోమేటిక్ స్కూటర్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 7 లీటర్లు.

సెమీ మోనోకాక్ స్ట్రక్చర్ ఆధారంగా చేసుకొని ఈ స్కూటర్‌ను తయారు చేశారు. హెడ్రాలిక్ డ్యాంపర్స్ మరియు హెలికల్ స్ప్రింగ్స్ ఇందులో సస్పెన్షలుగా పనిచేస్తాయి.

ఎల్ఎమ్ఎల్ స్టార్ యూరో 150 ఆటోమేటిక్ స్కూటర్ ఫ్రంట్ అండ్ రియర్ డ్రమ్ బ్రేక్స్‌తో లభిస్తుంది. ఇందులో ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

ఎల్ఎమ్ఎల్ స్టార్ యూరో 150 ఆటోమేటిక్ స్కూటర్ ఏడు ఆకర్షనీయమైన రంగుల్లో లభిస్తుంది.

ఇందులో గ్లవ్ కంపార్ట్‌మెంట్, ఇంజన్ కిల్ స్విచ్, ఎకానమీ మరియు పవర్ మోడ్స్‌తో కూడిన స్పీడోమీటర్ వంటి ఫీచర్లున్నాయి.

ఎల్ఎమ్ స్టార్ యూరో 150 ధరలు క్రింది విధంగా ఉన్నాయి.
ఎల్ఎమ్ స్టార్ యూరో 150 (డ్రమ్ బ్రేక్స్) - రూ.54,014
ఎల్ఎమ్ స్టార్ యూరో 150 (డిస్క్ బ్రేక్స్) - రూ.57,918
ఎల్ఎమ్ స్టార్ యూరో 150 (డిస్క్ బ్రేక్స్, మల్టీ కలర్) - రూ.59,422
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, గుజరాత్)


Click it and Unblock the Notifications








