తొలి మోటార్‌సైకిల్ సి-01ను ఉత్పత్తి చేయనున్న లోటస్
బ్రిటీష్ స్పోర్ట్స్ కార్ల తయారీ కంపెనీ 'లోటస్' (Lotus) మోటార్‌సైకిళ్ల వ్యాపారంలోకి ప్రవేశించనున్నట్లు పేర్కొంది. ఎలీస్, ఎక్సీజ్, ఎవోరా వంటి అందమైన లైట్‌వెయిట్ కార్లను తయారు చేసిన లోటస్ ఇప్పుడు తొలిసారిగా మోటార్‌సైకిల్‌ను తయారు చేయనుంది. సమీప భవిష్యత్తులోనే సి-01 (C-01) అనే తొలి బైక్‌తో మార్కెట్లోకి ప్రవేశిస్తామని లోటస్ తెలిపింది.
ఈ నేపథ్యంలో లోటస్ సి-01 (Lotus C-01) తొలి మోటార్‌సైకిల్‌కు సంబంధించిన టీజర్ ఫొటోలో ఇంటర్నెట్‌లో రిలీజ్ అయ్యాయి. తమ సి-01 "ఒక హైపర్ బైక్" అని పబ్లిర్ రోడ్లపై సాధారణ ద్విచక్ర వాహనాలలో కెల్లా ఇది అత్యంత విశిష్టంగా ఉంటుందని, ఇంటిగ్రేటెడ్ రేసింగ్ టెక్నాలజీతో దీనిని అభివృద్ధి చేశామని లోటస్ మోటార్‌సైకిల్ పేర్కొంది.
అయితే, సి-01 పూర్తిగా లోటస్ ఉత్పత్తి కాదని తెలుస్తోంది. దీని వెనుక మరికొన్ని పేర్లు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా. ఈ లోటల్ సి-01 మోటార్‌సైకిల్‌ను డానియేల్ సిమోన్ డిజైన్ చేశారు. ఈయన గతంలో ఫోక్స్‌వ్యాగన్ సంస్థలో పనిచేశారు. ఈ బైక్‌లోని సాంకేతిక భాగాన్ని కొడెవా రేసింగ్ టీమ్ తీర్చిదిద్దింది. ఈ బైక్‌లో సుమారు 200 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేసే ఇంజన్‌ను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.


ట్రాన్ సినిమాల్లో దర్శనమిచ్చే లైట్‌సైకిల్‌ను సృష్టించింది కూడా డిజైనర్ డానియేల్ సిమోన్ కావటం విశేషం



సైన్స్ ఫిక్షన్ సినిమా 'ఆబ్లివియన్'లో టామ్ క్రూజ్ నడిపిన 'బబుల్‌షిప్'ను డిజైన్ చేసిం కూడా డానియేల్ సిమోనే.





Click it and Unblock the Notifications








