లోటస్ సి-01 మోటార్‌సైకిల్ ఆవిష్కరణ; వివరాలు
ఎలీస్, ఎక్సీజ్, ఎవోరా వంటి అందమైన లైట్‌వెయిట్ కార్లను తయారు చేసిన బ్రిటీష్ స్పోర్ట్స్ కార్ మేకర్ 'లోటస్' (Lotus) మోటార్‌సైకిళ్ల వ్యాపారంలోకి ప్రవేశించనుందని, ఈ నేపథ్యంలో తమ తొలి మోటార్‌సైకిల్‌కు సంబంధించిన ఓ టీజర్ ఫొటోను కూడా విడుదల చేసిన విషయాన్ని మేము ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే.
కాగా.. లోటస్ ఇప్పుడు తమ తొలిసారిగా మోటార్‌సైకిల్ 'లోటస్ సి-01' (Lotus C-01)ను పూర్తిగా ఆవిష్కరించింది. తమ సి-01 "ఒక హైపర్ బైక్" అని పబ్లిక్ రోడ్లపై సాధారణ ద్విచక్ర వాహనాలలో కెల్లా ఇది అత్యంత విశిష్టంగా ఉంటుందని, ఇంటిగ్రేటెడ్ రేసింగ్ టెక్నాలజీతో దీనిని అభివృద్ధి చేశామని లోటస్ మోటార్‌సైకిల్ పేర్కొంది.
లోటస్ సి-01 మోటార్‌సైకిల్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని, ఇతర వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

గతంలో మేము చెప్పినట్లుగానే, సి-101 మోటార్‌సైకిల్‌ను పూర్తిగా లోటస్ తయారు చేయలేదు. జర్మనీకి చెందిన కొడెవా కంపెనీ ఈ లేటెస్ట్ మోటార్‌సైకిల్‌ను తయారు చేసింది.

సి-101 మోటార్‌సైకిల్ ప్రొడక్షన్ మరియు సేల్స్ కోసం లోటస్ పేరును ఉపయోగించుకునేందుకు కొడెవా లైసెన్స్‌ను కలిగి ఉంది.

ఈ లోటస్ సి-101 మోటార్‌సైకిల్‌లో 1195సీసీ, వి-ట్విన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్‌ను కెటిఎమ్ ఆర్‌సి8ఆప్ సూపర్‌బైక్ నుంచి గ్రహించారు.

ఈ ఇంజన్ గరిష్టంగా 200 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. భారీగా కనిపించే ఈ బైక్ మొత్తం బరువు 180 కేజీలు మాత్రమే.

లోటల్ సి-01 మోటార్‌సైకిల్‌ను డానియేల్ సిమోన్ డిజైన్ చేశారు. ఈ బైక్‌లోని సాంకేతిక భాగాన్ని కొడెవా రేసింగ్ టీమ్ తీర్చిదిద్దింది.

మరో నెల రోజుల వ్యవధిలో లోటస్ సి-01 మోటార్‌సైకిల్‌ను వాణిజ్య పరంగా అందుబాటులోకి తీసుకురానున్నారు.
మరో నెల రోజుల వ్యవధిలో లోటస్ సి-01 మోటార్‌సైకిల్‌ను వాణిజ్య పరంగా అందుబాటులోకి తీసుకురానున్నారు.

లోటస్ సి-01 అనేక కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. దీని ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.


Click it and Unblock the Notifications








