ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు తీసే ఎలక్ట్రిక్ బైక్

By Ravi

ఈ ఫొటోలో కనిపిస్తున్న మోటార్‌సైకిల్ పేరు 'లైట్నింగ్ ఎల్ఎస్-218' (Lightning LS-218). శాన్ కార్లోస్‌కి చెందిన లైట్నింగ్ మోటార్‌సైకిల్స్ అనే ఓ స్టార్టప్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల తయారీ సంస్థ ఈ బ్యూటిఫుల్ ఈ-బైక్‌ని తయారు చేసింది.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. పేరుకు తగినట్లుగానే లైట్నింగ్ ఎల్ఎస్-218 మెరుపు వేగంతో దూసుకుపోతుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ గరిష్టంగా గంటకు 218 మైళ్ల (350.8 కిలోమీటర్ల) వేగంతో పరుగులు తీస్తుందని కంపెనీ పేర్కొంది.

Lightning LS 218

ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌లో ఉపయోగించిన ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 200 హార్స్‌పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ మొత్తం బరువు 224.5 కేజీలు. లైట్నింగ్ ఎల్ఎస్-218 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ చూడటానికి సాంప్రదాయ స్పోర్ట్స్ బైక్‌ల మాదిరిగానే కనిపిస్తుంది.

ఈ బైక్‌లో ఉపయోగించిన బ్యాటరీలను పూర్తిగా చార్జ్ చేసుకుంటే 100 మైళ్ల దూరం ప్రయాణించవచ్చు. రైడింగ్ స్టైల్‌ని బట్టి రేంజ్ మారుతూ ఉంటుంది. లైట్నింగ్ ఎల్ఎస్-218 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఖరీదు 38,000 అమెరికన్ డాలర్లు.

Most Read Articles

English summary
Lightning Motorcycles, a small start-up electric motorcycle manufacturer based in San Carlos, have claimed to made the fastest motorcycle in the world, the LS-281.
Story first published: Tuesday, November 18, 2014, 11:10 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X