మహీంద్రా నుంచి 160సీసీ బైక్, ఈ ఏడాదే విడుదల!
మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన ద్విచక్ర వాహన విభాగం 'మహీంద్రా టూవీలర్స్' అందిస్తున్న బడ్జెట్ మోటార్‌సైకిళ్లు పాంటెరో, సెంచురో మోటార్‌సైకిళ్లు మార్కెట్లో మంచి సక్సెస్‌ను సాధించిన నేపథ్యంలో, కంపెనీ ఇప్పుడు ఓ 160సీసీ ప్రీమియం కమ్యూటర్ మోటార్‌సైకిల్ తయారీపై దృష్టి సారించింది.
ఈ ఏడాది చివరి నాటికి కానీ లేదా వచ్చే ఏడాది ఆరంభం నాటికి మహీంద్రా టూవీలర్స్ ఓ సరికొత్త 160సీసీ బైక్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. అయితే, ప్రస్తుతానికి తమ దృష్టంతా ప్రధానంగా ఓ సరికొత్త 110సీసీ స్కూటర్‌ను విడుదల చేయటంపైనే కేంద్రీకరించామని, ఇది పూర్తయిన తర్వాతనే 160సీసీ బైక్‌ను విడుదల చేస్తామని కంపెనీ వర్గాలు తెలిపాయి.
మహీంద్రా టూవీలర్స్‌కు 110సీసీ స్కూటర్ సెగ్మెంట్లో ఒక్క స్కూటర్ కూడా లేదు. ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న నాలుగు స్కూటర్లలో మూడు 125సీసీ స్కూటర్లు కాగా (రోడియో, డ్యూరో, ఫ్లైట్) ఒకటి 75సీసీ స్కూటర్ (కైన్).

సెంచురో
మహీంద్రా టూవీలర్స్ నుంచి అత్యధికంగా అమ్ముడుపోతున్న సెంచురో మోటార్‌సైకిల్‌లో ఈ సెగ్మెంట్లో కెల్లా విశిష్టమైన ఎలక్ట్రానిక్ ఫీచర్లతో లభిస్తున్న ఏకైక మోటార్‌సైకిల్. ఈ నేపథ్యంలో, మహీంద్రా నుంచి రానున్న మోడళ్లు ఈ తరహా అధునాత సాంకేతికతతోనే రూపుదిద్దుకునే ఆస్కారం ఉంది.

సెంచురో జెసి మోటో
ఆటో ఎక్స్‌పో 2014లో మహీంద్రా సెంచురో రెండు కొత్త రూపాల్లో దర్శనమిచ్చింది. అందులో ఒకటి కెఫే రేసర్ స్టైల్. ముంబైకి చెందిన జెసి మోటో ఈ సెంచురో కెఫే రేసర్ బైక్‌ను తయారు చేసింది. ఇది రెగ్యులర్ సెంచురో కన్నా 20 కేజీలు తేలికైనది.

సెంచురో స్క్రాంబ్లర్
ఇందులో రెండవ కస్టమ్ బైక్ మహీంద్రా సెంచురో స్క్రాంబ్లర్ మోడల్. దీనిని ముంబైకి చెందిన బాంబే కస్టమ్ వర్క్స్ కస్టమైజ్ చేసింది.

మహీంద్రా మోజో స్పోర్ట్
ఇకపోతే చివరిగా.. మహీంద్రా ప్రదర్శించిన ఉత్పత్తుల్లో మోజో స్పోర్ట్ ప్రత్యేకమైనది. ఇందులోని 295సీసీ సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్ గరిష్టంగా 28 బిహెచ్‌పిల శక్తిని, 25 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ప్రొడక్షన్ మోడల్.

మహీంద్రా మోటో3 రేసర్
మహీంద్రా టూవీలర్స్ కేవలం కమ్యూటింగ్ కోసం మాత్రమే కాకుండా రేస్, మోటార్‌స్పోర్ట్స్ కోసం కూడా ఉత్పత్తుల తయారు చేయనుంది. అలా రూపొందించినదే ఈ మహీంద్రా మోటో3 రేసర్ - ఎమ్‌జిపి 30.


Click it and Unblock the Notifications








