జులై 1న విడుదల కానున్న మహీంద్రా సెంచురో
మహీంద్రా టూవీలర్స్ ఈ ఏడాది ఆరంభంలో ఆవిష్కరించిన మహీంద్రా సెంచురో 110సీసీ ప్రీమియం మోటార్‌సైకిల్‌ను వచ్చే నెలలో మార్కెట్లో వాణిజ్య పరంగా లభ్యం కానుంది. ప్రసుతం మహీంద్రా అందిస్తున్న పాంటెరో బడ్జెట్ బైక్‌కు ప్రీమియం వెర్షనే ఈ సెంచురో.
మహీంద్రా సెంచురోలో అనేక ఆసక్తికరమైన ఫీచర్లు ఉన్నాయి. రిమోట్ కీ ఆప్షన్ ఇందులో ప్రధానంగా చెప్పుకోదగిన ఫీచర్. భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న ద్విచక్ర వాహనాల్లో రిమోట్ కీ ఆప్షన్‌తో లభ్యం కానున్న మొట్టమొదటి మోటార్‌సైకిల్ కూడా ఇదే. ఈ రిమోట్ కీలో ఫైండ్ మి (Find Me) అనే ఆప్షన్ ఉంటుంది. పార్కింగ్ స్థలంలో మీ వాహనాన్ని సులువుగా గుర్తించేందుకు ఈ ఫైండ్ మి బటన్‌ను నొక్కినట్లయితే మీ బైక్ ఇండికేటర్లు ఆన్ అయ్యి, సులువుగా గుర్తు పట్టేందుకు సహకరిస్తుంది.
అంతేకాకుండా, ఈ స్మార్ట్ మీ బైక్‌ను దొంగల బారిన పడకుండా కూడా రక్షిస్తుంది. కార్ల మాదిరిగానే ఇది ఫ్లిప్ కీ (కీని రిమోట్‌లోకి వెనక్కు మడిచిపెట్టవచ్చు). ఇది 96-బిట్ సెక్యూర్ యాక్సెస్‌ను కలిగి ఉంటుంది, దీనిని డూప్లికేట్ చేయటం అసాధ్యం. ఈ రిమోట్ కంట్రోల్ పూర్తిగా వాటర్‌ప్రూఫ్‌తో కూడుకుంది. ఇందులో ఎల్ఈడి టార్చ్, ఇమ్మొబిలైజర్ ఆప్షన్‌లు కూడా ఉన్నాయి.
ఇంకా ఇందులో సరికొత్త ఎల్ఈడి డిజిటల్ స్పీడో మీటర్, హెడ్‌లైట్‌కు పైభాగాన రెండు వైపులా జోడించిన ఎల్ఈడి ల్యాంప్స్ (పైలట్ ల్యాంప్స్), రియర్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్, సరికొత్త బాడీ డీజైన్ అండ్ గ్రాఫిక్స్ వంటి ఫీచర్లను గమనించవచ్చు.
మహీంద్రా పాంటెరో బైక్‌లో 106.7 సీసీ, ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, ఎమ్‌సిఐ-5 (మైక్రో చిప్ ఇగ్నైటెడ్ 5-కర్వ్) ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 8.5 పిఎస్‌ల శక్తిని, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 8.5 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 4-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ బైక్‌కు సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.












Click it and Unblock the Notifications








