మహీంద్రా సెంచురో విడుదల; ధర రూ.45,000
మహీంద్రా టూవీలర్స్ తమ అధునాతన 110సీసీ ప్రీమియం మోటార్‌సైకిల్ మహీంద్రా సెంచురోను నేడు మార్కెట్లో వాణిజ్య పరంగా విడుదల చేసింది. దేశీయ విపణిలో దీని ధర రూ.45,000 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ప్రారంభ ఆఫర్‌లో భాగంగా మొదటి 10,000 యూనిట్ల సెంచురో బైక్‌లను కేవలం రూ.44,000 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)లకే అందిస్తున్నామని కంపెనీ పేర్కొంది. ఈ బైక్‌పై కంపెనీ ఐదేళ్ల వారంటీని ఆఫర్ చేస్తుంది.
మహీంద్రా సెంచురో బైక్‌లో కంపెనీ దేశీయంగా అభివృద్ధి చేసిన 106.7 సీసీ, ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, ఎమ్‌సిఐ-5 (మైక్రో చిప్ ఇగ్నైటెడ్ 5-కర్వ్) ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 8.5 పిఎస్‌ల శక్తిని, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 8.5 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 4-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది లీటరుకు 85.4 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. మరిన్ని ఫీచర్లను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

ధర
బైక్ ప్రియులను ఆశ్చర్యపరుస్తూ కేవలం రూ.45,000 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభ ధరకే మహీంద్రా టూవీరల్స్ సెంచురో బైక్‌ను విడుదల చేసింది.

ఇంజన్
ఈ బైక్‌లో ఉపయోగించిన 106.7 సీసీ, ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, ఎమ్‌సిఐ-5 (మైక్రో చిప్ ఇగ్నైటెడ్ 5-కర్వ్) ఇంజన్ 8.5 పిఎస్‌ల శక్తిని, 8.5 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 4-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది.

మైలేజ్
మహీంద్రా సెంచురో లీటర్ పెట్రోలుకు 85.4 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

రిమోట్ కీ ఆప్షన్
మహీంద్రా సెంచురోలో అనేక ఆసక్తికరమైన ఫీచర్లు ఉన్నాయి. రిమోట్ కీ ఆప్షన్ ఇందులో ప్రధానంగా చెప్పుకోదగిన ఫీచర్. భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న ద్విచక్ర వాహనాల్లో రిమోట్ కీ ఆప్షన్‌తో లభ్యం కానున్న మొట్టమొదటి మోటార్‌సైకిల్ కూడా ఇదే.

ఫైండ్ మి ఆప్షన్
ఈ రిమోట్ కీలో ఫైండ్ మి (Find Me) అనే ఆప్షన్ ఉంటుంది. పార్కింగ్ స్థలంలో మీ వాహనాన్ని సులువుగా గుర్తించేందుకు ఈ ఫైండ్ మి బటన్‌ను నొక్కినట్లయితే మీ బైక్ ఇండికేటర్లు ఆన్ అయ్యి, సులువుగా గుర్తు పట్టేందుకు సహకరిస్తుంది.

యాంటీ థెఫ్ట్ అలారమ్
అంతేకాకుండా, ఈ స్మార్ట్ కీ మీ బైక్‌ను దొంగల బారిన పడకుండా కూడా రక్షిస్తుంది. ఇది 96-బిట్ సెక్యూర్ యాక్సెస్‌ను కలిగి ఉంటుంది, దీనిని డూప్లికేట్ చేయటం అసాధ్యం. నకిలీతో కీతో ఎవరైనా బైక్‌ను తస్కరించాలని ప్రయత్నిస్తే అలారమ్ మ్రోగుతుంది.

ఫ్లిప్ కీ
కార్ల మాదిరిగానే ఇది ఫ్లిప్ కీ (కీని రిమోట్‌లోకి వెనక్కు మడిచిపెట్టవచ్చు). ఈ రిమోట్ కంట్రోల్ పూర్తిగా వాటర్‌ప్రూఫ్‌తో కూడుకుంది. ఇందులో ఎల్ఈడి టార్చ్, ఇమ్మొబిలైజర్ ఆప్షన్‌లు కూడా ఉన్నాయి.

ఎల్ఈడి పైలట్ ల్యాంప్స్
ఇంకా ఇందులో సరికొత్త ఎల్ఈడి డిజిటల్ స్పీడో మీటర్, హెడ్‌లైట్‌కు పైభాగాన రెండు వైపులా జోడించిన ఎల్ఈడి ల్యాంప్స్ (పైలట్ ల్యాంప్స్), రియర్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్, సరికొత్త బాడీ డీజైన్ అండ్ గ్రాఫిక్స్ వంటి ఫీచర్లను గమనించవచ్చు.

గైడ్ మి ల్యాంప్స్
చీకట్లో బైక్‌ను పార్క్ చేసిన తర్వాత, ఇంజన్ ఆఫ్ చేసినప్పటికీ హెడ్‌లైట్స్ అర నిమిషం పాటు ఆన్‌లో ఉండి రైడర్‌కు మార్గం చూపిస్తుంది.

డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
సాధారణంగా హై-ఎండ్ బైక్‌లలో కనిపించే ఈ తరహా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను సెంచురో బైక్‌లోను గమనించవచ్చు.

గోల్డెన్ రిబ్స్
బైక్‌కు మరింత ప్రీమియం లుక్ కల్పించేలా సెంచురోలో ఫ్యూయెల్ ట్యాంక్‌కు క్రింది భాగంలో, ఫ్రంట్ స్క్రాచ్ గార్డ్‌కు పైభాగంలో గోల్డెన్ బార్‌ను అమర్చారు.










Click it and Unblock the Notifications








