మహీంద్రా సెంచురో బైక్ ఫీచర్ల కోసం పేటెంట్ హక్కులు

By Ravi

మహీంద్రా టూవీలర్స్ (మహీంద్రా అండ్ మహీంద్రా ద్విచక్ర వాహన విభాగం) అందిస్తున్న సెంచురో 110సీసీ బైక్ భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడుపోతున్న సంగతి తెలిసినదే. ఇందుకు ప్రధాన కారణంగా, అధునాత ఫీచర్లతో కూడిన ఈ బైక్ సరసమైన ధరకే లభ్యం కావటం.

ఈ నేపథ్యంలో, మహీంద్రా సెంచురో బైక్‌లోని ఫీచర్లను ఇతర తయారీదారులు కాపీ కొట్టకుండా ఉండేలా, కంపెనీ ఈ బైక్ ఫీచర్ల కోసం పేటెంట్ హక్కులను పొందింది. అంటే, మహీంద్రా సెంచురో బైక్‌లో ఉపయోగించిన టెక్నాలజీని, ఫీచర్లను మరే ఇతర కంపెనీలు తమ ఉత్పత్తులో ఉపయోగించే అవకాశం లేదన్నమాట.

ఆ వివరాలంటే తెలుసుకుందాం రండి..!

మహీంద్రా సెంచురో బైక్ ఫీచర్లు

మహీంద్రా ఇటీవలే తమ సెంచురో బైక్‌లో ఆఫర్ చేస్తున్న 4 ఫీచర్లకు అంతర్జాతీయ పేటెంట్లను పొందింది. అవి - ఫ్యూయెల్ గేజ్ సిస్టమ్, ఆటోమేటిక్ ఇగ్నిషన్ కట్-ఆఫ్, డిస్టన్స్ టూ ఎంప్టీ ఫ్యూయెల్ (శూన్యం నుంచి దూరం) సిస్టమ్, ఇంజన్ ఇమ్మొబిలైజర్ సిస్టమ్.

మహీంద్రా సెంచురో బైక్ ఫీచర్లు

మహీంద్రా సెంచురో బైక్‌లో ఇంజన్ ఇమ్మొబిలైజర్‌తో కూడిన యాంటీ థెఫ్ట్ అలారమ్ ఉంటుంది. ఎవరైనా డూప్లికేట్ కీతో బైక్ తాళం తీయాలని ప్రయత్నిస్తే, అలారమ్ మ్రోగి చుట్టుపక్కల ఉన్న వారిని అప్రమత్తం చేస్తుంది. ఈ తరహా ఫీచర్లను కార్లలో అలాగే హైఎండ్ బైక్‌లలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

మహీంద్రా సెంచురో బైక్ ఫీచర్లు

రిమోట్ ఫ్లిప్ కీ - కార్లలో మాదిరిగానే ఇది కూడా రిమోట్ కీతో లభిస్తుంది. ఈ కీని పూర్తిగా వెనుకకు మడిచేయవచ్చు, కీని జేబులో వేసుకున్నప్పుడు, జేబు చిరిగిపోతుందన్న భయం ఉండదు. ఈ కీని 96-బిట్ సెక్యూర్ యాక్సిస్‌తో తయారు చేశారు, దీనిని డూప్లికేట్ చేయటం అసాధ్యం. ఇది వాటర్ ప్రూఫ్ కీ. ఈ కీలో ఎల్ఈడి టార్చ్ కూడా ఉంటుంది.

మహీంద్రా సెంచురో బైక్ ఫీచర్లు

ఫైండ్ మి ల్యాంప్స్ - పార్కింగ్ ప్రదేశంలో లేదా బైక్‌లు ఎక్కువగా ఉండే ప్రాంతంలో మీ బైక్ ఎక్కడ ఉందో సులువుగా గుర్తించడానికి, ఫ్లిప్ కీపై ఉన్న ఒక్క బటన్ నొక్కిగానే ఇండికేటర్ లైట్లు బ్లింక్ అవుతాయి. దీంతో మీ బైక్ ఎక్కడున్నా ఒక్కచూపులోనే గుర్తించవచ్చు.

మహీంద్రా సెంచురో బైక్ ఫీచర్లు

గైడ్ ల్యాంప్స్ - రాత్రివేళల్లో బైక్ ఇంజన్ ఆఫ్ చేసిన తర్వాత కూడా కొన్ని సెకండ్ల పాటు హెడ్‌లైట్లు ఆన్‌లో ఉండి, దారి చూపిస్తాయి

మహీంద్రా సెంచురో బైక్ ఫీచర్లు

ఇంకా ఈ బైక్‌లో, శూన్యం నుంచి దూరం (డిటిఈ ఇండికేటర్), సర్వీస్ రిమైండర్, ఫ్యూయెల్ ఎకానమీ మోడ్ ఇండికేటర్లతో కూడిన డిజిటల్ డ్యాష్ బోర్డ్ కూడా ఉంటుంది.

మహీంద్రా సెంచురో బైక్ ఫీచర్లు

భారతదేశంలో లభిస్తున్న బడ్జెట్ రేంజ్ మోటార్‌సైకిళ్లలో ఇంతటి అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఫీచర్లను ఆఫర్ చేస్తున్న ఏకైక టూవీలర్ కంపెనీ కూడా మహీంద్రానే.

మహీంద్రా సెంచురో బైక్ ఫీచర్లు

ఈ మోటార్‌సైకిల్‌లో 106.7సీసీ ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, ఎమ్‌సిఐ-5 (మైక్రో చిప్ ఇగ్నైటెడ్ 5-కర్వ్) ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 8.5 పిఎస్‌ల శక్తిని, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 8.5 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 4-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, December 10, 2013, 11:28 [IST]
English summary
Mahindra Two Wheelers, the emerging player in India's flourishing two wheeler market has been putting up a strong show with its new Centuro 110cc segment commuter motorcycle. The Centuro alone resulted in triple digit growth figures for the company in the past few months. The reason being a featured packed offering.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+