హైదరాబాద్‌లో మహీంద్రా గస్టో స్కూటర్ విడుదల; ఫీచర్లు, వివరాలు
హైదరాబాద్: మహీంద్రా టూవీలర్స్, గడచిన సంవత్సరం సెప్టెంబర్ నెలలో భారత మార్కెట్లో విడుదల చేసిన తమ లేటెస్ట్ 110సీసీ స్కూటర్ 'మహీంద్రా గస్టో' (Mahindra Gusto)ను కంపెనీ తాజాగా రాష్ట్ర మార్కెట్లో కూడా విడుదల చేసింది. మహీంద్రా గస్టో స్కూటర్ రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. హైదరాబాద్ మార్కెట్లో వీటి ధరలు ఇలా ఉన్నాయి:
- మహీంద్రా గస్టో హెచ్ఎక్స్ - రూ.48,100
- మహీంద్రా గస్టో విఎక్స్ - రూ.50,100
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)
ఇది కూడా చదవండి: మహీంద్రా గస్టో టెస్ట్ రైడ్ రివ్యూ
మహీంద్రా గస్టో స్కూటర్‌ను అధునాతన ఇంజనీరింగ్ ఫీచర్లతో ఇటలీలో డిజైన్ చేయగా, పూనేలోని మహీంద్రా ఆర్ అండ్ డి కేంద్రలో దీనిని అభివృద్ధి చేశారు. ఈ స్కూటర్‌లో అధునాతన ఎమ్-టెక్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇందులోని 109.6సీసీ, 4-స్ట్రోక్, ఎయిర్-కూల్డ్ ఇంజన్ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 8.0 బిహెచ్‌పిల శక్తిని, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 9 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ సివిటి ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.
హైట్ అడ్జస్టబల్ సీట్, రిమోట్ ఫ్లిప్ కీ, ఫైండ్-మి ల్యాంప్స్, ఎల్ఈడి పైలట్ ల్యాంప్స్‌తో కూడిన హ్యాలోజెన్ హెడ్‌ల్యాంప్స్, క్విక్ స్టోరేజ్ కంపార్ట్‌మెంట్, ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక వైపు హైడ్రాలిక్ సస్పెన్షన్ వంటి ఫీచర్లున్నాయి. ఇది మొత్తం ఆరు రంగులలో (ఐస్‌బర్గ్ వైట్, గలాక్టిక్ బ్లాక్, మాగ్నటిక్ మాగ్నెటా, వొల్కానో రెడ్, ఆర్కిటిక్ వైట్, రావెన్ బ్లాక్) లభిస్తుంది.


Click it and Unblock the Notifications









