ఆటో ఎక్స్‌పో 2014: మహీంద్రా జేసీమోటో కెఫే రేసర్
ఆటోమొబైల్ రంగంలో ఎవరైనా కొత్త ట్రెండ్‌కు ఆజ్యం పోస్తే, ఇతర కంపెనీలు కూడా అదే బాట పట్టడం ఇప్పుడు సహజమైపోయింది. ప్రస్తుతం మోటార్‌సైకిల్ సెగ్మెంట్లో కెఫే రేసర్ స్టైల్ బైక్స్‌కు ప్రాధాన్యత పెరుగుతోంది. ఇటీవల రాయల్ ఎన్‌ఫీల్డ్ విడుదల చేసిన కెఫే రేసర్ స్టైల్ బైక్ 'కాంటినెంటల్ జిటి' మంచి సక్సెస్‌ను సాధించడంతో, ఇప్పుడు ఇతర కంపెనీలు కూడా ఈ తరహా బైక్‌లపై దృష్టి సారించాయి.
తాజాగా.. ప్రస్తుతం గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న ఆటో ఎక్స్‌పో 2014లో హీరో మోటోకార్ప్ తమ స్ప్లెండర్ కెఫే రేసర్ బైక్‌ను ప్రవేశపెట్టగా, మహీంద్రా టూవీలర్స్ ఓ కూడా ఓ కెఫే రేసర్ స్టైల్ బైక్‌ను ఆవిష్కరించింది. దీని పేరు 'మహీంద్రా జేసీమోటో కెఫే రేసర్'. మహీంద్రా టూవీలర్స్ కంపెనీ కోసం జేసీమోటో తయారు చేసిచ్చిన బైక్ ఇది.
మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

కెఫే రేసర్ అనేది బ్రిటీష్‌లో అంతరించి పోయిన ఓ సంస్కృతి.

1960 ప్రాంతంలో బైకర్లు/స్నేహితులు ఈ తరహా బైక్‌లపై అలా సరదా కెఫేలకు వెళ్లి చాయ్ త్రాగుతూ, బిస్కెట్ తింటూ మాంటా మంతీ జరుపుకునే వారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ సరికొత్త కాంటినెంటల్ జిటి కెఫే రేసర్ 535సీసీతో అంతరించిపోయిన సంస్కృతికి తిరిగి జీవం పోయగా, హీరో మోటోకార్ప్, మహీంద్రా టూవీలర్స్ కంపెనీలు ఇదే బాటలో కొత్త కెఫే రేసర్లను ఆవిష్కరించాయి.

మహీంద్రా జేసీమోటో కెఫే రేసర్ మోటార్‌సైకిల్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

మహీంద్రా జేసీమోటో కెఫే రేసర్‌లో రౌండ్ హెడ్‌ల్యాంప్, హ్యాండిల్ బార్స్‌కు ఇరువైపులా ఉండే రౌండెడ్ మిర్రర్స్‌లను ఇందులో చూడొచ్చు.

మహీంద్రా జేసీమోటో కెఫే రేసర్‌లో క్లాసిక్ బైక్‌లను తలపించేలా రౌండెడ్ మీటర్ కన్సోల్‌ను ఈ ఫొటోలో చూడొచ్చు.

మహీంద్రా జేసీమోటో కెఫే రేసర్ - స్పోక్ వీల్స్ విత్ డిస్క్ బ్రేక్స్.

మహీంద్రా జేసీమోటో కెఫే రేసర్ - రియర్ వ్యూ.

మహీంద్రా జేసీమోటో కెఫే రేసర్ - ఇంజన్

ఢిల్లీ ఆటో ఎక్స్‌పో 2014లో మహీంద్రా జేసీమోటో కెఫే రేసర్.


Click it and Unblock the Notifications








