మహీంద్రా స్కూటర్ పేరు 'గస్టో', సెప్టెంబర్ 29న విడుదల

దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన ద్విచక్ర వాహన విభాగం మహీంద్రా టూవీలర్స్, మొట్టమొదటి సారిగా తామే స్వతాహాగా అభివృద్ధి చేసిన (కోడ్ నేమ్ జి101) ఓ స్కూటర్‌ను కంపెనీ ఈ నెలాఖరుల విడుదల చేయనుంది. మహీంద్రా టూవీలర్స్ అభివృద్ధి ఈ గ్లోబల్ స్కూటర్‌కు 'గస్టో' (Gusto) అనే పేరును ఖరారు చేసినట్లు కంపెనీ పేర్కొంది.

మహీంద్రా గస్టో స్కూటర్ సెప్టెంబర్ 29, 2014న విడుదల కానుంది. ఈ స్కూటర్‌ను అధునాతన ఇంజనీరింగ్ ఫీచర్లతో ఇటలీలో అభివృద్ధి చేశామని, దీనిని భారతదేశంలోనే కాకుండా సౌత్ ఏషియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా వంటి ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో తమ గస్టో స్కూటర్‌ను విడుదల చేస్తామని కంపెనీ తెలిపింది.

Mahindra To Launch New Global Scooter

గస్టో స్కూటర్‌లో అధునాతన ఎమ్-టెక్ ఇంజన్‌ను ఉపయోగించినట్లు మహీంద్రా టూవీలర్స్ వివరించింది. ఈ సందర్భంగా గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు సభ్యుడు, ఫామ్ ఎక్విప్‌మెంట్‌, టూవీలర్‌ డివిజన్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ రాజేష్‌ జెజురికర్‌ మాట్లాడుతూ, గస్టో స్కూటర్‌ పూర్తి అల్యూమినియం ఎమ్-టెక్‌ ఇంజన్‌తో పాటుగా దృఢమైన క్రాంక్‌షాఫ్ట్ మరియు బేరింగ్స్, అధిక జడత్వం కలిగిన మాగ్నెటో, అత్యధిక శక్తి కలిగిన హెచ్‌టి కాయిల్‌ మరియు సిరీస్‌ రెగ్యులేటర్‌‌ల వలన గస్టో స్కూటర్ బెటర్ పవర్‌ను, మైలేజీని మరియు విశ్వసనీయతను ఆఫర్ చేస్తుందని ఆయన అన్నారు.

దీర్ఘకాలిక పరిశోధన మరియు వినియోగదారుని అవసరాలను ఆధారంగా చేసుకొని మహీంద్రా గస్టో స్కూటర్‌ను ఇటలీ స్టయిలింగ్‌లో డిజైన్ చేశామని, ఈ మోడల్‌ను ఇప్పటికే అనేక సార్లు టెస్టింగ్ చేసి, ఇందుకు సంబంధించిన ఫార్మాలిటీలన్ని పూర్తి చేసుకున్న నేపథ్యంలో, సెప్టెంబర్ 29న ఉత్తర మరియు పశ్చిమ భారతదేశంలోని మార్కెట్లలోను మరియు నేపాల్ మార్కెట్లోను విడుదల చేస్తామని ఆయన చెప్పారు. మరికొద్ది నెలల్లోనే దీనిని అంతర్జాతీయ మార్కెట్లలోకి తీసుకువెళ్తామని రాజేష్ తెలిపారు.

More from DriveSpark

Article Published On: Wednesday, September 24, 2014, 12:14 [IST]
English summary
Mahindra Two Wheelers Limited, a part of the US $16.5 billion Mahindra Group, today announced that its much awaited global scooter, code named G101, will be called ‘GUSTO’.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+