రూ.39,650 లకే మహీంద్రా పాంటెరో మోటార్‌సైకిల్
మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన ద్విచక్ర వాహన విభాగం 'మహీంద్రా టూవీలర్స్' అందిస్తున్న లేటెస్ట్ 110సీసీ మోటార్‌సైకిల్ 'మహీంద్రా పాంటెరో' (Mahindra Pantero)లో కంపెనీ మరొక చవక వేరియంట్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. అత్యంత పోటీతత్వ ధరతో కంపెనీ ఈ బైక్‌ను అందిస్తుంది. ఈ కొత్త ఎంట్రీ-లెవల్ వేరియంట్ మహీంద్రా పాంటెరో మోటార్‌సైకిల్ ధర రూ.39,650 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించినట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
రిలయబిలిటీ, పెర్ఫామెన్స్ మరియు ఫంక్షనాలిటీలను కోరుకునే కమ్యూటర్ సెగ్మెంట్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని పాంటెరోను డిజైన్ చేయటం జరిగిందని మహీంద్రా టూవీలర్స్ వెల్లడించింది. మహీంద్రా టూవీలర్స్ విశిష్టమైన కస్టమర్ సంబంధిత ఫీచర్లతో స్టయిలిష్‌గా ఉండే అలాగే ధరకు తగిన విలువతో కూడిన ఉత్పత్తులను అందించేందుకు కృషి చేస్తుందని, ఈ దిశలో భాగంగానే ఎల్ఈడి పైలట్ ల్యాంప్స్ అండ్ టెయిల్ ల్యాంప్స్, పూర్తి డిజిటల్ డ్యాష్‍బోర్డ్, అత్యంత పోటీతో కూడిన ధరతో పాంటెరోను అందిస్తున్నామని కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ వీరెన్ పోప్లీ తెలిపారు.
మహీంద్రా పాంటెరోలో ఉపయోగించిన 106.7సీసీ ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, ఎమ్‌సిఐ-5 (మైక్రో చిప్ ఇగ్నైటెడ్ 5-కర్వ్) ఇంజన్ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 8.5 పిఎస్‌ల శక్తిని, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 8.5 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 4-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది లీటరు పెట్రోలుకు 79.5 కి.మీ. (ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం) మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది. మహీంద్రా పాంటెరో వేరియంట్లు వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
- మహీంద్రా పాంటెరో (కిక్ స్టార్ట్ / స్పోక్ వీల్స్ / అనలాగ్ మీటర్ కన్సోల్): రూ.35,650
- మహీంద్రా పాంటెరో (కిక్ స్టార్ట్ / అల్లాయ్ వీల్స్ / అనలాగ్ మీటర్ కన్సోల్): రూ.40,550
- మహీంద్రా పాంటెరో (సెల్ఫ్ స్టార్ట్ / అల్లాయ్ వీల్స్ / అనలాగ్ మీటర్ కన్సోల్): రూ.42,250
- మహీంద్రా పాంటెరో (సెల్ఫ్ స్టార్ట్ / అల్లాయ్ వీల్స్ / డిజిటల్ మీటర్ కన్సోల్): రూ.43,150
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

మహీంద్రా పాంటెరో

మహీంద్రా పాంటెరో

మహీంద్రా పాంటెరో

మహీంద్రా పాంటెరో

మహీంద్రా పాంటెరో

మహీంద్రా పాంటెరో

మహీంద్రా పాంటెరో



Click it and Unblock the Notifications








