అతి త్వరలో మోజో 350సీసీ విడుదల: మహీంద్రా టూవీలర్స్
ప్రముఖ యుటిలిటీ వాహనాల తయారీ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్)కు చెందిన ద్విచక్ర వాహన విభాగం మహీంద్రా టూవీలర్స్ గతంలో పలు ఆటో ప్రదర్శనలలో ఆవిష్కరించిన పవర్‌ఫుల్ 350సీసీ మోటార్‌సైకిల్ 'మహీంద్రా మోజో' అతి త్వరలోనే దేశీయ రోడ్లపై పరుగులు పెట్టనుంది. కంపెనీ ఉన్నతాధికారి వెల్లడించిన సమాచారం ప్రకారం, ఈ మోడల్ వీలైనంత త్వరలోనే మార్కెట్లో విడుదల కానుంది.
మహీంద్రా టూవీలర్స్ తాజాగా అభివృద్ధి చేసిన పాంటెరో, సెంచురో మోటార్‌సైకిళ్లను చెన్నై మార్కెట్లోకి విడుదల చేసిన సందర్భంగా మహీంద్రా అండ్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (స్ట్రాటజీ అండ్ మార్కెట్ డెవలప్‌మెంట్) వీరెన్ పోప్లీ మాట్లాడుతూ. తమ పెర్ఫామెన్స్ మోటార్‌సైకిల్ మోజోను అతి త్వరలో మార్కెట్లో విడుదల చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఈ మోటార్‌సైకిల్ తుది దశ టెస్టింగ్‌లో ఉందని ఆయన తెలిపారు.
ఇండియన్ మార్కెట్లో విడుదల కావల్సి ఉన్న పెర్ఫామెన్స్ మోటార్‌సైకిళ్లలో మోజో కూడా ఒకటి. ఈ బైక్‌ను తొలిసారి ప్రదర్శించినప్పుడే అనేక మంది బైక్ ప్రియుల మదిని ఇది దోచుకుంది. ఆకర్షనీయమైన డిజైన్, హై పెర్ఫామెన్స్ ఇంజన్‌లతో కంపెనీ ఈ బైక్‌ను అభివృద్ధి చేసింది. ఇందులో ఉపయోగించిన 299సీసీ ఇంజన్‌ను మహీంద్రా టూవీలర్స్‌కు పూనేలో ఉన్న రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కేంద్రంలో అభివృద్ధి చేశారు.

మహీంద్రా మోజో

మహీంద్రా మోజో

మహీంద్రా మోజో

మహీంద్రా మోజో

మహీంద్రా మోజో

మహీంద్రా మోజో
మహీంద్రా టూవీలర్స్ ఈ మోడల్‌తో పాటుగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో మూడవ త్రైమాసికం నాటికి (2013 చివరి నాటికి) మరొక సరికొత్త స్కూటర్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేయనుంది. ఇదిలా ఉండగా, రానున్న పదిహేను రోజుల్లో కంపెనీ అందిస్తున్న రోడియో స్కూటర్‌లో మరొక కొత్త వేరియంట్‌ను విడుదల చేస్తామని మహీంద్రా టూవీలర్స్ విభాగం అధ్యక్షుడు మరియు గ్రూప్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ మెంబర్ అనూప్ మాథుర్ ఓ సందర్భంలో తెలిపారు.


Click it and Unblock the Notifications








