రీడిజైన్ చేసిన మోజోను విడుదల చేయనున్న మహీంద్రా
అదిగో విడుదల చేస్తాం, ఇదిగో విడుదల చేస్తాం అని చెబుతున్న మహీంద్రా మోజో 300సీసీ బైక్‌లో ఇప్పుడో కొత్త ట్విస్ట్ ఎదురయ్యింది. తాజా అప్‌డేట్ ప్రకారం, మహీంద్రా టూవీలర్స్ గతంలో ఆవిష్కరించిన మోజో కన్నా మరింత మెరుగైన డిజైన్‌తో కూడిన ఓ కొత్త వెర్షన్ మరికొద్ది నెలలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుత మహీంద్రా మోజోను ఇటలీకి చెందిన ఇంజన్స్ అండ్ ఇంజనీరింగ్ సంస్థతో కలిసి మహీంద్రా అభివృద్ధి చేసింది. మాలాగుటి ఎమ్ఆర్250 అనే మోటార్‌సైకిల్‌ను కొద్దిగా మార్పులు చేసి, అందులో 2-స్ట్రోక్ ఇంజన్ స్థానంలో 292సీసీ 4-స్ట్రోక్ ఇంజన్‌ను రీప్లేస్ చేసి, ప్రస్తుత మహీంద్రా మోజో 300 బైక్‌ను డెవలప్ చేసినట్లు సమాచారం.
మహీంద్రా టూవీలర్స్ ఇటీవలే సరికొత్త డిజైన్, సెగ్మెంట్లో కెల్లా విశిష్టమైన మరియు ఏ టూవీలర్ కంపెనీ ఆఫర్ చేయని ఫీచర్లతో అభివృద్ధి చేసిన పాంటెరో, సెంచురో బైక్‌లను విడుదల చేసిన నేపథ్యంలో కొత్తగా అభివృద్ధి చేయనున్న మోజో డిజైన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మహీంద్రా మోజో బైక్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

మార్కెట్ ట్రెండ్
ప్రస్తుతం భారత ఆటోమొబైల్ మార్కెట్లోని టూవీలర్ సెగ్మెంట్లో ట్రెండ్ మారింది. ఒకప్పుడు ఖరీదైన స్పోర్ట్స్ బైక్‌లకు అంతదా ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు. అయితే, ఈ సెగ్మెంట్లో చవక మోడళ్లు వస్తుండటంతో పోటీ జోరందుకుంది. హోండా సిబిఆర్ 250ఆర్, బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్, కవాసకి నిన్జా 300, కెటిఎమ్ డ్యూక్ వంటి మోడళ్లు ఇప్పటికే మంచి సక్సెస్‌ను సాధించాయి. ఈ నేపథ్యంలో మోజోకు కూడా మంచి డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది.

మాలాగుటి ఎమ్ఆర్250
మాలాగుటి ఎమ్ఆర్250 అనే మోటార్‌సైకిల్‌ను కొద్దిగా మార్పులు చేసి, అందులో 2-స్ట్రోక్ ఇంజన్ స్థానంలో 292సీసీ 4-స్ట్రోక్ ఇంజన్‌ను రీప్లేస్ చేసి, ప్రస్తుత మహీంద్రా మోజో 300 బైక్‌ను డెవలప్ చేసినట్లు సమాచారం.

మోజో డిజైన్ మార్పు
ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న మహీంద్రా మోజో డిజైన్ బాగానే ఉన్నప్పటికీ, స్పోర్ట్స్ బైక్ సెగ్మెంట్లో పెరిగిన పోటీని దృష్టిలో ఉంచుకొని ఇంతకన్నా మరింత మెరుగైన ఉత్పత్తిని మార్కెట్లో విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

గుడ్లగూబ కళ్ల లాంటి హెడ్‌లైట్స్
ప్రస్తుత మహీంద్రా మోజో హెడ్‌లైట్స్ గుడ్లగూబ కళ్ల మాదిరిగా ఉంటాయి. కొత్తగా రానున్న అప్‌గ్రేడెడ్ మహీంద్రా మోజోలో హెడ్‌లైట్స్ యూనిట్ సింగిల్‌గా ఉండొచ్చని అంచనా.

రీడిజైన్డ్ ఫ్యూయెల్ ట్యాంక్
ప్రస్తుతం మహీంద్రా మోజో ఫ్యూయెల్ ట్యాంక్ ఫ్లాట్‌గా ఉన్నట్లు అనిపిస్తుంది. కాబట్టి కొత్త మోజోలో ఫ్యూయెల్ ట్యాంక్‌ను కూడా రీడిజైన్ చేసే ఆస్కారం ఉంది.

మంచి డిజైన్ రావాలని కోరుకుందాం
ఏదేమైనప్పటికీ, మహీంద్రా మోజో రీడిజైన్ విషయంలో ప్రస్తుత వెర్షన్ కన్నా మరింత మెరుగైన డిజైన్ లుక్ అండ్ ఫీల్‌తో కూడిన అప్‌గ్రేడెడ్ వెర్షన్ వీలైనంత త్వరలోనే మార్కెట్లోకి రావాలని కోరుకుందాం.


Click it and Unblock the Notifications








