మిచిగాన్‌లో మహీంద్రా జెన్‌జీ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్లాంట్

By Ravi

భారత్‌కు చెందిన మహీంద్రా గ్రూప్ అమెరికన్ మార్కెట్ కోసం 'మహీంద్రా జెన్‌జీ' (Mahindra GenZe) అనే ఎలక్ట్రిక్ స్కూటర్ అభివృద్ధి చేస్తోందని మేము ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా.. తాజా అప్‌డేట్ ప్రకారం, మహీంద్రా గ్రూప్ అమెరికాలోని సౌత్ఈస్ట్ మిచిగాన్‌లో మహీంద్రా నార్త్ అమెరికన్ టెక్నికల్ సెంటర్ వద్ద (ఎమ్ఎన్ఏటిసి) వద్ద ఓ ఎలక్ట్రిక్ టూవీలర్ ప్లాంట్‌ను ప్రారంభించింది.

ప్రస్తుతం ఈ ప్లాంట్‌లో సాలీనా 9,000 వాహనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. అవసరమనుకుంటే, ఈ ఉత్పత్తి సామర్థ్యాన్ని భవిష్యత్తులో 20,000 యూనిట్లకు విస్తరించుకునే అవకాశం కూడా ఉంది. గడచిన సంవత్సరం సెప్టెంబర్ నెలలో తొలిసారిగా ఈ జెన్‌జీ ఎలక్ట్రిక్ స్కూటర్ మహీంద్రా గ్రూప్ అమెరికాలో ఆవిష్కరించింది. దీనిని కాలిఫోర్నియాలోని పాలో ఆల్టోలో అభివృద్ధి చేశారు.


పర్యావరణ సాన్నిహిత్య వాహనాలను ప్రోత్సహించే ప్రపంచ ప్రణాళికలో భాగంగా దీనని తయారు చేశారు. రోజువారీ ప్రయాణ అవసరాలకు అనువుగా ఉండేలా మహీంద్రా జెన్‌జీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తేలికపాటి నిర్మాణం కలిగి ఉండేలా డిజైన్ చేశారు. భవిష్యత్తులో మహీంద్రా జెన్‌జీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను చైనా, ఇండియా దేశాల్లో కూడా ప్రవేశపెట్టనున్నారు. మహీంద్రా జెన్‌జీ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర 3000 డాలర్లు (సుమారు రూ.1,80,000) ఉండొచ్చని అంచనా.

మహీంద్రా జెన్‌జీ ఒక సింగిల్ సీటర్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ సీట్ వెనుక భాగంలో ఓ పెద్ద బకెట్ లాంటి టబ్ ఉంటుంది. ఇందులో చిన్నపాటి లగేజ్‌ను భద్రపరచుకోవచ్చు. ఈ స్టోరేజ్ బకెట్‌లో సరుకుల సంచులు, మీడియం సైజ్ లగేజ్ బ్యాగ్‌లు మొదలైన వాటిని ఉంచుకోవచ్చు. రోజువారీ ప్రయాణ/రవాణా అవసరాలకు ఇది అనువుగా ఉంటుంది. అంతేకాకుండా, ఈ స్కూటర్‌లో సీట్ క్రింది భాగంలో కూడా స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. ఇందులో ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ ఫోన్ల వంటి గ్యాడ్జెట్లను భద్రపరుచుకోవచ్చు మరియు వాటిని యూఎస్‌బి పోర్ట్ సాయంతో రీచార్జ్ కూడా చేసుకోవచ్చు.

Mahindra GenZe

సాంప్రదాయ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ స్థానంలో 7-ఇంచ్ వాటర్‌ప్రూఫ్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఉంటుంది. దీనిని బ్లూటూత్‌తో కనెక్ట్ చేసుకునే సౌలభ్యం ఉంటుంది. ఇది బ్యాటరీ స్టేటస్, మిగిలి ఉన్న బ్యాటరీ సామర్థ్యం వంటి పలు అంశాలను చూపిస్తుంది. జెన్‌జీ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు సంబంధించి మహీంద్రా ఎలాంటి సాంకేతిక వివరాలు వెల్లడించకపోయినప్పటికీ, ఇది లిథియం అయాన్ బ్యాటరీతో పనిచేస్తుందని తెలుస్తోంది. ఇందులో 1.4 కి.వా. ఎలక్ట్రిక్ మోటార్‌ను ఉపయోగించనున్నారు. దీని గరిష్ట వేగం గంటకు 50 కి.మీ. దీని రేంజ్ ఇంకా తెలియరాలేదు.

More from DriveSpark

Article Published On: Monday, May 12, 2014, 11:03 [IST]
English summary
Mahindra Group has inaugurated its first manufacturing facility at Mahindra North American Technical Center (MNATC) in Southeast Michigan, USA to produce the Mahindra GenZe electric scooter.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+