రాష్ట్ర మార్కెట్లో మహీంద్రా పాంటెరో మోటార్‌సైకిల్ విడుదల
హైదరాబాద్: మహీంద్రా గ్రూపుకు చెందిన ద్విచక్ర వాహన విభాగం 'మహీంద్రా టూవీలర్స్' ఇటీవల భారత మార్కెట్లో ఆవిష్కరించిన సరికొత్త 110సీసీ మోటార్‌సైకిల్ 'మహీంద్రా పాంటెరో' (Mahindra Pantero)ను కంపెనీ రాష్ట్ర మార్కెట్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. మహీంద్రా టూ వీలర్స్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ కస్టమర్ కేర్) ధర్మేంద్ర మిశ్రా పాంటెరో బైక్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు.
రాష్ట్ర మార్కెట్లో మహీంద్రా పాంటెరో మోటార్‌సైకిల్ ధరలు రూ. 40,599 నుంచి రూ. 44,599 రేంజ్‌లో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్). ఎల్ఈడి పైలట్ ల్యాంప్స్ అండ్ టెయిల్ ల్యాంప్స్, పూర్తి డిజిటల్ డ్యాష్‍బోర్డ్, అల్లాయ్ వీల్స్, స్టయలిష్ డిజైన్, సాటిలేని మైలేజ్ 79.5 కెఎమ్‌పిఎల్ (ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం) వంటి ఫీచర్లు ఈ బైక్ సొంతం.
మహీంద్రా పాంటెరోలో ఉపయోగించిన 106.7సీసీ ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, ఎమ్‌సిఐ-5 (మైక్రో చిప్ ఇగ్నైటెడ్ 5-కర్వ్) ఇంజన్ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 8.5 పిఎస్‌ల శక్తిని, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 8.5 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 4-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది మొత్తం నాలుగు వేరియంట్లలో లభిస్తుంది.

మహీంద్రా పాంటెరో

మహీంద్రా పాంటెరో

మహీంద్రా పాంటెరో



Click it and Unblock the Notifications








