మహీంద్రా టూవీలర్స్ నుంచి కొత్త 110సీసీ స్కూటర్

By Ravi

సెంచురో, పాంటెరో మోడళ్లు తెచ్చిపెట్టిన విజయంతో మాంచి జోరు మీదున్న మహీంద్రా టూవీలర్స్ (మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన ద్విచక్ర వాహన విభాగం) ఇప్పుడు ద్విచక్ర వాహన విభాగంలో మరిన్ని కొత్త ఉత్పత్తులను కొనుగోలుదారులకు పరిచయం చేసేందుకు సిద్ధమవుతోంది. గతంలో ఒకానొక సందర్భంలో కంపెనీ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. రానున్న రెండున్నరేళ్లలో ప్రతి మూడు నెలలకు ఓ కొత్త ఉత్పత్తి చొప్పున్న మొత్తం 10 కొత్త ద్విచక్ర వాహన మోడళ్లను మార్కెట్‌కు పరిచయం చేస్తామని చెప్పారు.

తాజా.. అప్‌డేట్ ప్రకారం, ఈ కొత్త మోడళ్లలో తొలుతగా ఓ కొత్త 110సీసీ స్కూటర్ మార్కెట్లోకి రానుంది. జి101 అనే కోడ్ నేమ్‌తో ఈ స్కూటర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు సమచారాం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌‌పోలో ఈ కొత్త స్కూటర్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.

Mahindra Scooter

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ కొత్త మహీంద్రా స్కూటర్‌లో సరికొత్త 110సీసీ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. (స్కూటర్ సెగ్మెంట్లో మహీంద్రాకు ఇప్పటివరకు 110సీసీ ఇంజన్ లేదు. మోటార్‌సైకిల్ సెగ్మెంట్లో ఇటీవలే కొత్తగా 110సీసీ ఇంజన్‌ను పరిచయం చేశారు).

ప్రస్తుతం మహీంద్రా అందిస్తున్న డ్యూరో డిజెడ్, రోడియో ఆర్‌జెడ్ స్కూటర్లలో 125సీసీ ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు. దీన్నిబట్టి చూస్తుంటే, మహీంద్రా నుంచి రానున్న కొత్త 110సీసీ స్కూటర్ ఈ రెండు మోడళ్ల కన్నా మెరుగైన మైలేజీని ఆఫర్ చేయవచ్చని తెలుస్తోంది.

అంతేకాదు.. 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో మహీంద్రా టూవీలర్స్ నుంచి విడుదల కానున్న ఉత్పత్తుల్లో మరో ప్రధానమైన మోడల్ 'మోజో'. రీడిజైన్ చేసిన మోజో బైక్‌ను కూడా మహీంద్రా వచ్చే ఏడాది విడుదల చేయనుంది. ఆటోమొబైల్ రంగంలో ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Monday, December 16, 2013, 17:01 [IST]
English summary
Mahindra Two Wheelers has revealed that, it will launch 10 new products during the next two and a half years, with a new launch once every three months. The first of these models was supposed to be a brand new 110cc scooter. The latest report, which cites insider sources, claims that the upcoming Mahindra 110cc segment scooter is code named G101 and will be launched at the India Auto Expo in Feb 2014.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+