మహీంద్రా సెంచురోపై రూ.5,000 క్యాష్‌బ్యాక్

By Ravi

మహీంద్రా టూవీలర్స్ అందిస్తున్న సెంచురో మోటార్‌సైకిల్ అతి తక్కువ సమయంలోనే రెండు లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయిని చేరుకుంది. ఈ విజయాన్ని పురస్కరించుకొని కంపెనీ ఈ మోటార్‌సైకిల్‌పై క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది.

'కామ్‌యాబి కా జస్న్' (విజయపు వేడుక) అనే క్యాంపైన్‌లో భాగంగా, మహీంద్రా టూవీలర్స్ సెంచురో మోడల్ కొనుగోలుపై రూ.5,000, సెంచురో ఎన్1 కొనుగోలుపై రూ.3,500, సెంచురో రాక్‌స్టార్ కొనుగోలుపై రూ.2,000 క్యాష్ బ్యాక్‌ను ఇవ్వనుంది.

మహీంద్రా సెంచురో బైక్‌లో ఉపయోగించిన 106.7 సీసీ, ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, ఎమ్‌సిఐ-5 (మైక్రో చిప్ ఇగ్నైటెడ్ 5-కర్వ్) ఇంజన్‌ 8.5 పిఎస్‌ల శక్తిని, 8.5 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 4-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది.

Mahindra Centuro

ఏఆర్ఏఐ (ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) సర్టిఫై చేసిన దాని ప్రకారం, మహీంద్రా సెంచురో లీటర్ పెట్రోలుకు 85.4 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. మహీంద్రా సెంచురోలో అనేక ఆసక్తికరమైన ఫీచర్లు ఉన్నాయి.

రిమోట్ కీ ఆప్షన్, ఫైండ్ మి ల్యాంప్స్, యాంటీ-థెఫ్ట్ అలారమ్, ఫ్లిప్ కీ, ఎల్ఈడి పైలట్ ల్యాంప్స్, గైడ్ మి ల్యాంప్స్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, గోల్డెన్ రిబ్స్ మొదలైన ఫీచర్లున్నాయి.

More from DriveSpark

Article Published On: Thursday, September 25, 2014, 10:07 [IST]
English summary
To celebrate the success of the Mahindra Centuro, Mahindra Two Wheelers has announced the “Kamyabi Ka Jashn” promotion this festive season. Through this limited period promotion, the company is offering new consumers a cash back of Rs 5,000 on the purchase of the Centuro and Rs 3,500 and Rs 2,000 cashback on the purchase of the Centuro N1 and the Centuro Rockstar respectively.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+