రాజస్థాన్ రాయల్స్‌తో చేతులు కలిపిన మహీంద్రా టూవీలర్స్
దేశీయ ఆటో దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన ద్విచక్ర వాహన విభాగం మహీంద్రా టూవీలర్స్, 2013వ ఎడిషన్ పెప్సి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) కోసం రాజస్థాన్ రాయల్స్ క్రికెట్ జట్టుతో చేతులు కలిపినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు 6వ ఎడిషన్ ఐపిఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు మహీంద్రా టూవీలర్స్ అసోషియేట్ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. ఈ ఒప్పందంలో భాగంగా రాజస్థాన్ రాయల్స్ జట్టు సభ్యులు మహీంద్రా టూవీల్స్ అందించనున్న ఉత్పత్తులకు ప్రచారం కల్పించనున్నారు.
మహీంద్రా టూవీలర్స్ తాజాగా మార్కెట్లో విడుదల చేసిన బడ్జెట్ మోటార్‌సైకిల్ మహీంద్రా పాంటెరో బ్రాండింగ్‌ను ఆటగాళ్ల లీడింగ్ లెగ్ యొక్క ట్రౌజర్‌పై ముద్రించడం జరుగుతుంది. పాంథర్ నుంచి స్ఫూర్తి పొంది రూపొందించిన మహీంద్రా పాంటెరో మోటార్‌సైకిల్ రాజస్థాన్ రాయల్స్ జట్టు మాదిరిగానే అన్నివిభాగాల్లో సమర్థవంతమైన పెర్ఫామెన్స్‌ను కనబరుస్తుందని కంపెనీ పేర్కొంది.

మహీంద్రా పాంటెరో కమ్యూటర్ మోటార్‌సైకిల్ విషయానికి వస్తే, ఇది మొత్తం నాలుగు వేరియంట్లలో లభ్యమవుతుంది. ప్రారంభ వేరియంట్ ధర రూ.39,650 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. రిలయబిలిటీ, పెర్ఫామెన్స్ మరియు ఫంక్షనాలిటీలను కోరుకునే కమ్యూటర్ సెగ్మెంట్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని పాంటెరోను డిజైన్ చేయటం జరిగిందని మహీంద్రా టూవీలర్స్ వెల్లడించింది.
ఎల్ఈడి పైలట్ ల్యాంప్స్ అండ్ టెయిల్ ల్యాంప్స్, పూర్తి డిజిటల్ డ్యాష్‍బోర్డ్, సరసమైన ధరలు పాంటెరో ప్రత్యేకతలు. ఈ బైక్‌లో ఉపయోగించిన 106.7సీసీ ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, ఎమ్‌సిఐ-5 (మైక్రో చిప్ ఇగ్నైటెడ్ 5-కర్వ్) ఇంజన్ గరిష్టంగా 8.5 పిఎస్‌ల శక్తిని, 8.5 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 4-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది లీటరు పెట్రోలుకు 79.5 కి.మీ. (ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం) మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.


Click it and Unblock the Notifications








