మహీంద్రా సెంచురో ఎన్1 విడుదల: ధర, ఫీచర్లు

By Ravi

మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన ద్విచక్ర వాహన విభాగం మహీంద్రా టూవీలర్స్ అందిస్తున్న 'సెంచురో' (Centuro) మోటార్‌సైకిల్‌లో ఓ కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. 'మహీంద్రా సెంచురో ఎన్1' (Mahindra Centuro N1) పేరిట కంపెనీ ఓ సరికొత్త బైక్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో కొత్తగా అభివృద్ధి చేసిన ఎమ్‌సిఐ-5 (మైక్రో చిప్ ఇంటిగ్రేటెడ్-5 కర్వ్) ఇంజన్‌ను ఉపయోగించారు.

ఈ ఇంజన్ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 8.5 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరుకు 85.4 కి.మీ. (ఏఆర్ఏఐ సర్టిఫైడ్) మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. మహీంద్రా సెంచురో ఎన్1 కంపెనీ అంతర్జాతీయంగా పేటెంట్ పొందిన యాంటీ థెఫ్ట్ అలారమ్ విత్ ఇమ్మొబిలైజర్ ఫీచర్‌తో లభిస్తుంది. ఇంకా ఇందులో, రిమోట్ ఫ్లిప్ కీ, ఫైండ్ మి ల్యాంప్స్, గైడ్ ల్యాంప్స్ వంటి విశిష్టమైన ఫీచర్లతో లభిస్తుంది.

Centuro N1

మహీంద్రా సెంచురో ఎన్1 ధర రూ.45,700 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఇది ఐదేళ్ల వారంటీతో లభ్యం కానుంది. కొత్తగా విడుదల చేసిన మహీంద్రా సెంచురో ఎన్1 సాలిడ్ పెర్ఫామెన్స్‌ని, ఆకర్షనీయమై స్టయిలింగ్‌ను మరియు ఆశ్చర్యకరమైన టెక్నాలజీని కేవలం రూ.45,700ల సరసమైన ధరకే కస్టమర్లకు అందిస్తుందని మహీంద్రా టూవీలర్స్ వైస్ ప్రెసిడెంట్ వీరెన్ పోప్లీ అన్నారు.
Centuro N1

మహీంద్రా సెంచురో మార్కెట్లోకి విడుదలైన 6 నెలల సమయంలోనే 1,00,000 మందికి పైగా కస్టమర్లకు చేరువయ్యింది. అంతేకాకుండా, బ్లూంబెర్గ్ ఇండియా ఆటోకార్ ఇండియా నుంచి 'వ్యూవర్ ఛాయిస్ బైక్ ఆఫ్ ది ఇయర్', బైక్ ఇండియా నుంచి 'రీడర్స్ ఛాయిస్ బైక్ ఆఫ్ ది ఇయర్' మరియు డిఎన్ఏ నుంచి 'బైక్ మేకర్ ఆఫ్ ది ఇయర్' అవార్డులను దక్కించుకుంది.

More from DriveSpark

Article Published On: Friday, January 24, 2014, 19:19 [IST]
English summary
Mahindra Two Wheelers Ltd. has launches the Centuro N1 in Pune. The Centuro N1 will be powered by Mahindra’s indigenously developed intelligent MCi-5 (Micro Chip ignited-5 curve) engine delivering a power output of 8.5 BHP 7500 RPM and an astounding mileage of 85.4 kmpl (ARAI).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+