స్పోర్టీ మహీంద్రా రోడియో యూజెడ్ఓ 125 విడుదల
మహీంద్రా గ్రూపుకు చెందిన ద్విచక్ర వాహన విభాగం మహీంద్రా టూవీలర్స్ అందిస్తున్న 125సీసీ స్కూటర్ రోడియోలో కంపెనీ ఓ సరికొత్త స్పోర్టీ వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. మహీంద్రా రోడియో యూజెడ్ఓ 125 (Rodeo UZO 125) పేరుతో కంపెనీ విడుదల చేసిన ఈ స్పోర్టీ వెర్షన్ స్కూటర్ రెగ్యులర్ వెర్షన్ రోడియో స్కూటర్ కన్నా భిన్నంగా ఉంటుంది.
మహీంద్రా రోడియో యూజెడ్ఓ 125 స్కూటర్ కొత్త రేసింగ్ స్టైల్ బాడీ గ్రాఫిక్స్, కలర్డ్ వీల్స్‌తో మంచి స్పోర్టీ లుక్‌ను కలిగి ఉంటుంది. ఇంకా ఇందులో టూటోన్ డ్యూయెల్ టెక్స్చర్ సీట్ మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ స్కూటర్‌లో అధునాతన డిసిడిఐ టెక్నాలజీ మరియు ఏటిఎల్ఏ సిస్టమ్‌ను ఉపయోగించారు. దీని వలన బెటర్ పెర్ఫార్మెన్స్, లోవర్ మెయింటినెన్స్ సాధ్యమవుతుంది.

ముందు వైపు హెవీ డ్యూటీ టెలిస్కోప్ సస్పెన్షన్, ఎక్స్‌టర్నల్ ఫ్రంట్ ఫ్యూయెలింగ్, ఫుల్లీ డిజిటల్ స్పీడోమీటర్, హై స్పీడ్ అలారమ్, 22 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్, యాంటీ-థెఫ్ట్ కీ వంటి అనేక ఫీచర్లు ఈ స్కూటర్ సొంతం. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం, ఇది లీటరుకు 59 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది. ఇది రేస్‌ట్రాక్ బ్లాక్, కోల్ట్ బ్లాక్, విక్టరీ వైలెట్, బ్లేజింగ్ బ్లూ అనే నాలుగు రంగులలో లభిస్తుంది.
ఇన్ని విశిష్టమైన ఫీచర్లు కలిగిన రోడియో యూజెడ్ఓ 125 స్కూటర్ ధర కేవలం రూ.47,957 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మాత్రమే.


Click it and Unblock the Notifications








