బైక్‌ల కోసం మ్యాప్‌మైఇండియా ట్రైల్‌‌బ్లేజర్ 2 విడుదల

By Ravi

భారత్‌లో ఆఫ్టర్ మార్కెట్ జిపిఎస్ నావిగేషన్ సిస్టమ్‌లు ఇప్పటి వరకూ కార్లకు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఇప్పడు ఇవి బైక్‌లకు అందుబాటులోకి వచ్చాయి. ప్రముఖ నావిగేషన్ సిస్టమ్‌ల తయారీ కంపెనీ మ్యాప్‌మైఇండియా (MapmyIndia) ఇప్పుడు బైక్‌ల కోసం ఓ సరికొత్త జిపిఎస్ నావిగేషన్ పరికరాన్ని విడుదల చేసింది.

8.9 సెం.మీ. వెడల్పు కలిగిన ఈ టచ్‌స్క్రీన్ జిపిఎస్ పరికరం మాదిరిగానే కాకుండా మ్యూజిక్, ఫొటోలు, సినిమాలు వంటి అన్ని ఎంటర్‌టైన్‌మెంట్ ఫీచర్లను కూడా సపోర్ట్ చేస్తుంది. ట్రైల్‌బ్లేజర్ 2 (Trailblazer 2)గా పిలిచే ఈ జిపిఎస్ కంపెనీ ముందుగా లోడ్ చేసిన డోన్ట్ పానిక్ (Don't Panic Software Interface) ఫీచర్‌తో లభిస్తుంది.

ఈ జిపిఎస్ పరికం బైక్‌లోని బ్యాటరీ సాయంతో ఛార్జ్ అవుతుంది. దీనికోసం డిజైన్ చేయబడిన ఓ ప్రత్యేక క్లాంప్ సాయంతో ఎలాంటి బైక్ హ్యాండిల్‌బార్‌పై అయినా దీనిని ఫిక్స్ చేయటం చాలా సులువుగా ఉంటుంది. దీనిని స్టాండర్డ్ బ్లూటూత్ హెడ్‌సెట్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు. భారత మార్కెట్లో ట్రైల్‌‌బ్లేజర్ 2 ధర రూ.16,990 లుగా ఉంది.

లాంగ్ జర్నీలు, కొత్త రూట్లలో ప్రయాణించే వారికి మార్గనిర్దేశం చేయటంలోను, సమీపంలో ఉండే పెట్రోల్ బంకులు, రెస్టారెంట్లు, హాస్పిటళ్లు మొదలైన సమాచారాన్ని రైడర్లకు తెలియజేయటంలో ఈ జిపిఎస్ నావిగేటర్లు చక్కగా పనిచేస్తాయి. మరి మీరు కూడా మీ బైక్‌కు ఈ జిపిఎస్ నావిగేటర్‌ను ఫిక్స్ చేసుకోవాలనుకుంటున్నారా..?

మ్యాప్‌మైఇండియా ట్రైల్‌‌బ్లేజర్ 2

మ్యాప్‌మైఇండియా ట్రైల్‌‌బ్లేజర్ 2

మ్యాప్‌మైఇండియా ట్రైల్‌‌బ్లేజర్ 2

మ్యాప్‌మైఇండియా ట్రైల్‌‌బ్లేజర్ 2

మ్యాప్‌మైఇండియా ట్రైల్‌‌బ్లేజర్ 2

మ్యాప్‌మైఇండియా ట్రైల్‌‌బ్లేజర్ 2

మ్యాప్‌మైఇండియా ట్రైల్‌‌బ్లేజర్ 2

మ్యాప్‌మైఇండియా ట్రైల్‌‌బ్లేజర్ 2

మ్యాప్‌మైఇండియా ట్రైల్‌‌బ్లేజర్ 2

మ్యాప్‌మైఇండియా ట్రైల్‌‌బ్లేజర్ 2

More from DriveSpark

Article Published On: Saturday, June 22, 2013, 9:33 [IST]
English summary
MapmyIndia has launched a new GPS navigator device called Trailblazer 2 which is specially designed for bikes. The new device comes with 8.9-cm wide touch screen and includes all the entertainment features like music, photos and movies on the go. The MapmyIndia Trailblazer 2 is priced at Rs. 16,990.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+