మెర్సిడెస్ ఏ 45 ఏఎమ్‌జి కారు స్ఫూర్తితో రాట్‌వైల్డ్ సైకిల్
ఇప్పటికే పలు ఆటోమొబైల్ సంస్థలు సైకిళ్ల తయారీ సంస్థలతో చేతులు కలిపి, కార్లను స్ఫూర్తిగా తీసుకొని విభిన్నమైన లిమిటెడ్ ఎడిషన్ సైకిళ్లను అభివృద్ధి చేసిన సంగతి తెలిసినదే. తాజాగా, ఇదే కోవలో జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ అందిస్తున్న 'మెర్సిడెస్ ఏ45 ఏఎమ్‌జి' ఎడిషన్ 1 స్పోర్ట్స్ హ్యాచ్‌బ్యాక్ నుంచి స్ఫూర్తి పొంది ఈ ఆర్.ఎక్స్45 ఏఎమ్‌జి అనే సైకిల్‌ను అభివృద్ధి చేశారు.
జర్మనీకు చెందిన ప్రీమియం మోటార్‌సైకిళ్ల తయారీ సంస్థ రాట్‌వైల్డ్ బైక్స్ ఈ ఆర్.ఎక్స్45 ఏఎమ్‌జి సైకిల్‌ను తయారు చేసింది. ఏఎమ్‌జి అనేది మెర్సిడెస్ బెంజ్ యొక్క పెర్ఫామెన్స్ డివిజన్. ఇది పెర్ఫామెన్స్ వెర్షన్, స్పోర్ట్ వెర్షన్ కార్లను అభివృద్ధి చేస్తుంది. రాట్‌వైల్డ్ ఈ ఏఎమ్‌జితో కలిసి తమ పెర్ఫామెన్స్ మౌంటౌన్ బైక్‌ను తయారు చేసింది. ఈ రెండు సంస్థల నుంచి వస్తున్న తొలి ఉత్పత్తి కూడా ఇదే కావటం విశేషం. మరి ఈ రాట్‌వైల్డ్ ఆర్.ఎక్స్45 ఏఎమ్‌జి సైకిల్ విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

స్ఫూర్తి
రాట్‌వైల్డ్ ఆర్.ఎక్స్45 ఏఎమ్‌జి మౌంటైన్ బైక్‌ను మెర్సిడెస్ ఏ 45 ఏఎమ్‌జి "ఎడిషన్ 1" స్పోర్ట్స్ హ్యాచ్‌బ్యాక్ నుంచి స్ఫూర్తి పొంది డిజైన్ చేశారు.

డిజైన్
ఏ 45 ఏఎమ్‌జి కారు డిజైన్ క్యూలను ఈ ఆర్.ఎక్స్45 సైకిల్‌లో గమనించవచ్చు. తెలుపు రంగు ఫ్రేమ్, మ్యాట్ బ్లాక్ అండ్ గ్రాఫైట్ గ్రే కలర్ రియర్ స్వింగ్ ఆర్మ్ మరియు రెడ్ డీటేలింగ్‌ను ఈ సైకిల్‌లో స్పష్టంగా చూడొచ్చు.

పూర్తిగా చేతులతో తయారీ
అన్ని రాట్‌వైల్డ్ సైకిళ్ల మాదిరిగానే ఈ రాట్‌వైల్డ్ ఆర్.ఎక్స్45 ఏఎమ్‌జి మౌంటైన్ బైక్‌ను కూడా జర్మనీలో పూర్తిగా చేతుల్తో తయారు చేశారు.

ఆల్ టెర్రైన్ సైకిల్
రాట్‌వైల్డ్ ఆర్.ఎక్స్45 ఏఎమ్‌జి మౌంటైన్ బైక్ మంచి సస్పెన్షన్‌ను కలిగి ఉండి, అన్ని రోడ్లపై సవారీకి అనువుగా ఉంటుంది.

ధృఢమైన నిర్మాణం
సాధారణ రోడ్లపైనే కాకుండా, కొండలు లోయలు అసలు రోడ్లే లేని ప్రాంతాల్లో కూడా నడిపేలా ఈ సైకిల్‌ను అభివృద్ధి చేశారు. ఈ సైకిల్ ఫ్రేమ్ ధృఢమైన నిర్మాణాన్ని కలిగి ఉండి, రైడర్‌కు మంచి సౌకర్యాన్ని అందిస్తుంది.

కార్బన్ ఫైబర్ మెటీరియల్
రాట్‌వైల్డ్ ఆర్.ఎక్స్45 ఏఎమ్‌జి మౌంటైన్ బైక్‌ను తేలికగా ఉంచేందుకు గాను ఈ సైకిల్ తయారీలో ఎక్కువ భాగం కార్బన్ ఫైబర్ పదార్థాన్ని ఉపయోగించారు.

లిమిటెడ్ ఎడిషన్ బైక్
రాట్‌వైల్డ్ ఆర్.ఎక్స్45 ఏఎమ్‌జి ఒక లిమిటెడ్ ఎడిషన్ సైకిల్. ఇది పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

మరిన్ని లిమిటెడ్ ఎడిషన్ ఉత్పత్తులు
మెర్సిడెస్ ఏఎమ్‌జి, రాట్‌వైల్డ్ సంస్థల నుంచి వస్తున్న తొలి ఉత్పత్తి ఇది. భవిష్యత్తులో ఇలాంటివి మరిన్ని లిమిటెడ్ ఎడిషన్ ఉత్పత్తులు మార్కెట్లోకి రానున్నాయి.

ఆర్.ఎక్స్45 ఏఎమ్‌జి ధర
ఈ ఆర్.ఎక్స్45 ఏఎమ్‌జి సైకిల్ ధర 6990 యూరోలు. మన దేశ కరెన్సీలో సుమారు రూ.5.44 లక్షలు. ఈ సైకిల్ ఎక్కడపడితే అక్కడ, ఎప్పుడుపడితే అప్పుడు దొరకదు. ఇది కేవలం ఆర్డరుపై మాత్రమే లభిస్తుంది.


Click it and Unblock the Notifications








