మిషన్ మోటార్‌సైకిల్స్ నుంచి ఆర్ఎస్ ఎలక్ట్రిక్ సూపర్‌బైక్
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ 'మిషన్ మోటార్‌సైకిల్స్' (Mission Motorcycles) ఓ అద్భుతమైన రేస్ వెర్షన్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను రూపొందించింది. 'మిషన్ ఆర్ఎస్' (Mssion RS)గా పిలిచే ఈ ఎలక్ట్రిక్ సూపర్‌బైక్ గరిష్టంగా గంటకు 257 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయగలదు. అంతేకాదండోయ్, కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం ఇది సింగిల్ ఛార్జ్‌పై 321 కిలోమీటర్ల (రియల్ వరల్డ్ రేంజ్ 225 కిలోమీటర్ల) దూరం ప్రయాణించగలదు.
మిషన్ ఆర్ఎస్ ఎలక్ట్రిక్ సూపర్‌బైక్‌లో 160 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్‌ను ఉపయోగించారు. ఈ ఎలక్ట్రిక్ మోటార్ 17 కి.వాట్ బ్యాటరీ ప్యాక్‌తో నడుస్తుంది. ఈ బైక్ కేవలం 3 సెకండ్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. బిఎస్‌టి కార్భన్ ఫైబర్ వీల్స్, ఓహ్లిన్స్ డబ్ల్యూఎస్‌బికె సస్పెన్షన్, మోటోజిపి బ్రేమ్బో బ్రేక్స్ ఇందులో ప్రధాన ఫీచర్లు. మిషన్ మోటార్‌సైకిల్స్ కేవలం 40 యూనిట్ల మిషన్ ఆర్ఎస్ ఎలక్ట్రిక్ సూపర్‌బైక్‌లను మాత్రమే ఉత్పత్తి చేయనుంది.
ఈ బైక్‌లో 4జి నెట్‌వర్క్‌తో పనిచేసే టచ్‌స్క్రీన్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్ ఉంటుంది. ఇది గూగుల్ ద్వారా జిపిఎస్ వ్యవస్థకు అనుసంధానం చేయబడి ఉంటుంది. ఇది పూర్తిగా కంపెనీ అభివృద్ధి చేసిన మిషన్ ఓఎస్ (ఆపరేటింగ్ సిస్టమ్)తో పనిచేస్తుంది. ఇందులో బ్లూటూత్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. అంతేకాదు, హెడ్‌లైట్‌కు పై భాగంలో ఓ హైడెఫినెషన్ కెమెరాను కూడా అమర్చారు. ఇది 1080పి రెజల్యూషన్‌లో వీడియోను రికార్డ్ చేస్తుంది. మిషన్ ఆర్ఎస్ ఎలక్ట్రిక్ సూపర్‌బైక్ అంచనా ధర సుమారు రూ.17 లక్షలు. మరి ఈ బ్యూటీపై మనం కూడా ఓ లుక్కేద్దామా..?

'మిషన్ ఆర్ఎస్' (Mssion RS)ఈ ఎలక్ట్రిక్ సూపర్‌బైక్‌ను ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ 'మిషన్ మోటార్‌సైకిల్స్' (Mission Motorcycles) రూపొందించింది.

రేస్ బైక్‌ల నుంచి స్ఫూర్తి పొంది మిషన్ మోటార్‌సైకిల్స్ ఈ బైక్‌ను అభివృద్ధి చేసింది.

మిషన్ ఆర్ఎస్ పూర్తిగా ఎలక్ట్రిక్ బైక్. ఇది బ్యాటరీ పవర్‌తో నడుస్తుంది.

మిషన్ ఆర్ఎస్ ఎలక్ట్రిక్ సూపర్‌బైక్ గరిష్టంగా గంటకు 257 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయగలదు.

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం ఇది సింగిల్ ఛార్జ్‌పై 321 కిలోమీటర్ల (రియల్ వరల్డ్ రేంజ్ 225 కిలోమీటర్ల) దూరం ప్రయాణించగలదు.

మిషన్ ఆర్ఎస్ ఎలక్ట్రిక్ సూపర్‌బైక్‌లో 160 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్‌ను ఉపయోగించారు.

ఈ ఎలక్ట్రిక్ మోటార్ 17 కి.వాట్ బ్యాటరీ ప్యాక్‌తో నడుస్తుంది.

ఈ బైక్ కేవలం 3 సెకండ్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.

ఈ బైక్‌పై ఒక్కరికి మాత్రమే చోటు ఉంటుంది. ఇదొక సింగిల్ సీటర్ రేస్ బైక్ లాటింది.

బిఎస్‌టి కార్భన్ ఫైబర్ వీల్స్, ఓహ్లిన్స్ డబ్ల్యూఎస్‌బికె సస్పెన్షన్, మోటోజిపి బ్రేమ్బో బ్రేక్స్ ఇందులో ప్రధాన ఫీచర్లు.

మిషన్ మోటార్‌సైకిల్స్ కేవలం 40 యూనిట్ల మిషన్ ఆర్ఎస్ ఎలక్ట్రిక్ సూపర్‌బైక్‌లను మాత్రమే ఉత్పత్తి చేయనుంది.

ఈ బైక్‌లో 4జి నెట్‌వర్క్‌తో పనిచేసే టచ్‌స్క్రీన్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్ ఉంటుంది.

ఇది గూగుల్ ద్వారా జిపిఎస్ వ్యవస్థకు అనుసంధానం చేయబడి ఉంటుంది. ఇది పూర్తిగా కంపెనీ అభివృద్ధి చేసిన మిషన్ ఓఎస్ (ఆపరేటింగ్ సిస్టమ్)తో పనిచేస్తుంది. ఇందులో బ్లూటూత్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

హెడ్‌లైట్‌కు పై భాగంలో ఓ హైడెఫినెషన్ కెమెరాను కూడా అమర్చారు. ఇది 1080పి రెజల్యూషన్‌లో వీడియోను రికార్డ్ చేస్తుంది.

మిషన్ ఆర్ఎస్ ఎలక్ట్రిక్ సూపర్‌బైక్ అంచనా ధర సుమారు రూ.17 లక్షలు.

మిషన్ ఆర్ఎస్ ఎలక్ట్రిక్ సూపర్‌బైక్


Click it and Unblock the Notifications








