భారత్‌కు వస్తున్న మరో ఇటాలియన్ బైక్ కంపెనీ

By Ravi

ఇటలీకి చెందిన ద్విచక్ర వాహనాల తయారీ కంపెనీ మోటో మోరిని (Moto Morini) భారత మార్కెట్‌పై కన్నేసింది. మోటో మోరిని గ్లోబల్ మార్కెట్లలో విక్రయిస్తున్న పాపులర్ మోడళ్లు గ్రాన్‌పాసో, స్క్రాంబ్లర్ (Granpasso, Scrambler)లను ఇండియాకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది.

గ్రేటర్ నోయిడాలో ఫిబ్రవరి 5, 2014వ తేది నుంచి ప్రారంభం కానున్న 12వ ఎడిషన్ ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో మోటో మోరిని ఈ రెండు కొత్త ఉత్పత్తులను విడుదల చేయనుంది. ఈ మోటార్‌సైకిళ్లను విదేశాల నుంచి సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో దిగుమతి చేసుకొని, ఇండియాలో విక్రయించున్నారు.

భారత్‌లో వర్డెంచి మోటార్‌సైకిల్స్ కంపెనీ ద్వారా ఈ మోటో మోరిని గ్రాన్‌పాసో, స్క్రాంబ్లర్ మోడళ్లను విక్రయించనున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇటలీకి చెందిన మోటో మోరిని గడచిన సంవత్సరంలోనే ముంబైకి చెందిన కస్టమ్ బైక్ మేకర్ వర్డెంచి మోటార్‌సైకిల్స్‌తో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా, వర్డెంచి ఆల్ట్రా ప్రీమియం మోటార్‌సైకిళ్లను డిజైన్ చేసి, మోటో మోరినికి తయారు చేసి ఇవ్వాల్సి ఉంటుంది.

Moto Morini Granpasso

ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ఈ కొత్త మోటార్‌సైకిళ్లను ఆవిష్కరించనున్నారు. ఇదే సమయంలో జాయింట్ వెంచర్ గురించి అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ జాయింట్ వెంచర్ త్వరలోనే దేశవ్యాప్తంగా తమ ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయనుంది. గ్రాన్‌పాసో బైక్‌ను అడ్వెంచర్ రైడ్స్ కోసం తయారు చేయగా, స్క్రాంబ్లర్‌ను ఆల్-టెర్రైన్ ఉపయోగార్థం తయారు చేశారు.

ఈ రెండు మోటార్‌సైకిళ్లలో ఒకేరకమైన ఇంజన్‌ను ఉపయోగించారు. ఇందులో 1187సీసీ వి-ట్విన్ ఓవర్‌స్క్వేర్ ఇంజన్‌ను ఉపయోగించారు. వీటి ధరలు మరియు ఇతర వివరాలను విడుదల సమయంలో వెల్లడించనున్నారు. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Friday, January 31, 2014, 11:29 [IST]
English summary
Italian bike-maker Moto Morini said it will launch two motorcycle models namely Granpasso and Scrambler at the forthcoming Auto Expo in Greater Noida. The motorcycles will be imported and distributed in India by Vardenchi Motorcycles, the company said in a release.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+