మోటోపెడ్: హైబ్రిడ్ మోపెడ్ మౌంటైన్ బైక్
నేటి ఆధునిక మోటార్‌సైకిళ్లకు మూలం ఒకప్పటి సైకిళ్లే. మోటారైజ్డ్ సైకిళ్ల (మోటార్/ఇంజన్‌తో కూడిన సైకిళ్ల) కాన్సెప్ట్ కొత్తేమీ కాదు. ఇప్పటికే వివిధ సంస్థలు ఈ తరహా సైకిళ్లను రూపొందించాయి. ఇప్పటి వరకు మనం ఎలక్ట్రిక్ మోటార్‌తో కూడిన హైబ్రిడ్ సైకిళ్ల గురించి తెలుసుకున్నాం. ఈ కథనంలో చిన్నసైజు పెట్రోల్ ఇంజన్‌తో కూడిన హైబ్రిడ్ సైకిల్ గురించి తెలుసుకుందాం రండి.
ఈ ఫొటోల్లో కనిపిస్తున్న సైకిల్ పేరు మోటోపెడ్. దీనిని సాధారణ సైకిల్ మాదిరిగా పెడల్స్ సాయంతో తొక్కుకోవచ్చు లేదా ఇందులో చిన్నపాటి పెట్రోల్ ఇంజన్ సాయంతో రయ్యమని రోడ్డుపై దూసుకుపోవచ్చు. ఇది సాధారణ మోటారైజ్డ్ సైకిళ్ల కన్నా భిన్నంగా ఉంటుంది. ఈ మోటోపెడ్‌ను మామూలు రోడ్లు, ఆఫ్ రోడింగ్ బైక్, డర్ట్ బైక్, మౌంటైన్ బైక్‌గా ఉపయోగించుకోవచ్చు.
ఈ మోటోపెడ్ హైబ్రిడ్ మౌంటైన్ సైకిల్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

మోటోపెడ్ ప్రాజెక్ట్
మోటోపెడ్ హైబ్రిడ్ బైక్ ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రయోగ దశలో ఉంది. దీని సృష్టికర్తలు నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. ఆసక్తి కలిగిన వారు పెట్టుబడి పెడితే, వీటిని పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేసి, తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకువస్తామని చెబుతున్నారు.

పిట్ బైక్ మౌంటైన్ బైక్ హైబ్రిడ్
పిట్ బైక్, మౌంటైన్ బైక్‌లను కలిపి మోటోపెడ్ హైబ్రిడ్ బైక్‌ను తయారు చేశారు. పిట్ బైక్‌లంటే సాధారణంగా రేసింగ్ పోటీల్లో రేస్ పిట్‌లలో ఉపయోగించే చిన్న, తేలికపాటి ద్విచక్ర వాహనాలు. వీటిని హ్యాండిల్ చేయటం చాలా సులవుగా ఉంటుంది.

మోటోపెడ్ కోసం కస్టమ్ పార్ట్స్
మోటోపెడ్‌లో ఉపయోగించిన ఫ్రేమ్, స్వింగ్ ఆర్మ్, సబ్ ఫ్రేమ్, జాక్‌షిఫ్ట్ అసెంబ్లీ, స్ప్రాకెట్స్, బాటమ్ బ్రాకెట్, రియర్ హబ్, ఎగ్జాస్ట్ సిస్టమ్ (పైప్ అండ్ మఫ్లర్) అన్నీ కూడా కస్టమ్ బిల్ట్ విడిభాగాలే.

పిట్, మౌంటైన్ బైక్ పార్ట్స్
ఈ మోటోపెడ్‌లో ఉపయోగించిన ఇతర భాగాలను పిట్ బైక్‌లు, మౌంటైన్ బైక్‌ల నుంచి గ్రహించారు.

పిట్ బైక్ ఇంజన్
మోటోపెడ్‌లో ఇంజన్ అత్యంత ముఖ్యమైనది. ఈ ఇంజన్‌ను బట్టే మోటోపెడ్ పనితీరు ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు సిటీ ట్రావెల్ కోసం చిన్న ఇంజన్, ఆఫ్ రోడింగ్ కోసం పెద్ద ఇంజన్‌లు అవసరం అవుతాయి. 50-190సీసీ సామర్థ్యం కలిగిన హోండా ఆర్ఎక్స్50/పిట్ బైక్ ఇంజన్లను రికమెండ్ చేస్తారు. ఖర్చు తగ్గించుకోవాలనుకుంటే చైనా ఇంజన్లను కొనుగోలు చేయవచ్చు.

మౌంటైన్ బైక్ పార్ట్స్
మోటోపెడ్ హైబ్రిడ్ బైక్ తయారీలో ఫోర్క్స్, వీల్స్, టైర్స్, రియర్ షాక్, బ్రేక్స్, క్రాంక్స్, పెడల్స్, హెడ్‌సెట్, ఫ్రీవీల్ వంటి మౌంటైన్ బైక్ విడిభాగాలు ఉంటాయి.

పిట్ బైక్ పార్ట్స్
అలాగే, ఇందులో ఇంజన్, ట్యాంక్, సీట్, ప్లాట్సిక్స్, థ్రోటల్ వంటి పిట్ బైక్ విడి భాగాలుంటాయి.

పేటెంటెడ్ పెడల్ డ్రైవ్ సిస్టమ్
మోటారైజ్డ్ సైకిళ్ల మాదిరిగా కాకుండా, ఈ పెడల్ డ్రైవ్ సిస్టమ్‌లో ఇందులో సింగిల్ చైన్ ఉండి, పవర్‌ను వెనుక చక్రాలు బదిలీ చేస్తుంది.

ధర
మోటోపెడ్ గురించి మరింత సమాచారం, దీని ధర తదితర వివరాలు తెలుసుకోవాలంటే కిక్‌స్టార్టర్ పేజ్‌ను సందర్శించాలి. ఈ లోపుగా మోటోపెడ్ పనితీరుని తర్వాతి స్లైడ్‌లో వీక్షిద్దాం రండి.
వీడియో
మోటోపెడ్ హైబ్రిడ్ సైకిల్ పనితీరును సూచించే వీడియో.


Click it and Unblock the Notifications








