కొత్త 2015 సుజుకి స్విష్ స్కూటర్ విడుదల; ధర రూ.51,661
జపనీస్ టూవీలర్ బ్రాండ్ సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న 'స్విష్ 125' (Swish) స్కూటర్‌లో ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మేము ఇది వరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా.. కంపెనీ ఇప్పుడు తమ అప్‌గ్రేడెడ్ 2015 సుజుకి స్విష్ స్కూటర్‌ను సైలెంట్‌గా మార్కెట్లో విడుదల చేసింది.
కొత్త 2015 సుజుకి స్విష్ స్కూటర్‌లో కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్, అడ్వాన్స్డ్ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో సర్వీస్ రిమైండర్, డ్యూయెల్ ట్రిప్ మీటర్, డిజిటల్ క్లాక్ ఫీచర్లతో కూడిన కొత్త డిజిటల్ మీటర్, 20 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్, 6 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ వంటి ఫీచర్లున్నాయి. కాగా.. ఇంజన్ పరంగా కొత్త సుజుకి స్విష్‌లో ఎలాంటి మార్పులు చేర్పులు లేవు.

ఇందులోని 124సీసీ, ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్, ఫోర్-స్ట్రోక్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 7000 ఆర్‌పిఎమ్ వద్ద 8.58 హార్స్ పవర్‌ల శక్తిని, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 9.8 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ సివిటి ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.
కొత్త ఫీచర్లతో వచ్చిన సుజుకి స్విష్ తన స్మార్ట్, యూత్‌ఫుల్ లుక్‌తో యంగ్ అర్బన్ రైడర్లను ఆకట్టుకునేలా ఉంటుందని సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ గుప్తా తెలిపారు.

కొత్త 2015 సుజుకి స్విష్ మెటాలిక్ సోనిక్ సిల్వర్/గ్లాస్ స్పార్కల్ బ్లాక్, పెరల్ మిరాజ్ వైట్, గ్లాస్ స్పార్కల్ బ్లాక్, క్యాండీ డార్క్ చెర్రీ/గ్లాస్ స్పార్కల్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దేశీయ విపణిలో కొత్త స్విష్ స్కూటర్ ధర రూ.51,661 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.


Click it and Unblock the Notifications








