రాష్ట్ర మార్కెట్లో బజాజ్ డిస్కవర్ 125టి విడుదల

By Ravi

దేశీయ ద్విచక్ర దిగ్గజం బజాజ్ ఆటో రాష్ట్ర మార్కెట్లో మరొక కొత్త మోటార్‌సైకిల్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది.. కంపెనీ అందిస్తున్న డిస్కవర్ సిరీస్‌లోమరొక కొత్త వేరియంట్‌ను బజాజ్ హెదరాబాద్‌లో విడుదల చేసింది.

బజాజ్ ఆటో ఇటీవలే దేశీయ మార్కెట్లో ప్రవేశపెట్టిన అధునాతన 'డిస్కవర్ 125 ఎస్‌టి' (స్పోర్ట్స్ టూరర్) ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా రూపొందించిన 'డిస్కవర్ 125టి' బైక్‌ను కంపెనీ విడుదల చేసింది.

వాస్తవానికి ఈ రెండు మోడళ్లలో బేసిక్ డిజైన్, ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. అయితే, కొత్తగా విడుదల చేసిన డిస్కవర్ 125టి వేరియంట్‌లో మోనోషాక్ (సెంటర్) అబ్జార్వర్ స్థానంలో నైట్రాక్స్ షాక్ అబ్జార్వర్లను అమర్చారు.

రాష్ట్ర మార్కెట్లో డిస్కవర్ 125టి రెండు వేరియంట్లలో (డ్రమ్ బ్రేక్, డిస్క్ బ్రేక్) లభ్యమవుతుంది. వాటి ధరల వివరాలు ఉన్నాయి:

  • డిస్కవర్ 125టి డ్రమ్ బ్రేక్: రూ.53,676
  • డిస్కవర్ 125టి డిస్క్ బ్రేక్: రూ.56,725

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)

Bajaj Discover 125T

ఈ కొత్త బైక్‌లో డిటిఎస్-ట్విన్ స్పార్క్ టెక్నాలజీ కలిగిన ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 13 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. స్పోర్టీ లుక్‌నిచ్చే కొత్త డిస్కవర్ 125టిలో 5-స్పీడ్ గేర్ బాక్స్, రీడిజైన్ చేయబడిన ఫ్యూయెల్ ట్యాంక్, షార్ప్ ఎడ్జ్‌లు కలిగిన పవర్‌ఫుల్ హెడ్‌ల్యాంప్, స్టయిలిష్ అల్లాయ్ వీల్స్, ఎలాంటి రోడ్లపై అయినా సౌకర్యవంతంగా ప్రయాణించేలా రూపొందించిన యాంటీ వైబ్రేషన్ ఫ్రేమ్, మరింత సురక్షితమైన బ్రేకింగ్ కోసం అమర్చిన పెటల్ డిస్క్ బ్రేక్ వంటి ఫీచర్లున్నాయి.

More from DriveSpark

Article Published On: Saturday, July 13, 2013, 13:41 [IST]
English summary
Bajaj Auto has launched new Discover 125T in Hyderabad. New Bajaj Discover 125T gets gas-charged nitrox suspension system instead of monoshock suspension system.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+