కొత్త బజాజ్ ప్లాటినా ఈఎస్ విడుదల; 96.9 కెఎంపిఎల్ మైలేజ్
దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో విక్రయిస్తున్న చీప్ అండ్ బెస్ట్ కమ్యూటర్ మోటార్‌సైకిల్ బజాజ్ ప్లాటినాలో కంపెనీ ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేయనున్నట్లు మేము ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా.. కంపెనీ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ, ఈ సెగ్మెంట్లో అత్యధిక మైలేజీనిచ్చే సరికొత్త 'బజాజ్ ప్లాటినా ఈఎస్' (ఎలక్ట్రిక్ స్టార్ట్)ను విపణిలో విడుదల చేసింది.
ఈ సెగ్మెంట్లో హీరో స్ప్లెండర్, హీరో ప్యాషన్, హోండా డ్రీమ్ సిరీస్ మరియు టీవీఎస్ స్టార్ సిటీ వంటి మోటార్‌సైకిళ్లకు గట్టి పోటీనిచ్చే విధంగా, లీటరు పెట్రోలుకు ఏకంగా 96.9. కిలోమీటర్ల మైలేజీనిచ్చేలా (ఏఆర్ఏఐ సర్టిఫైడ్ మైలేజ్) రూపొందించిన ప్లాటినా ఈఎస్ మోడల్‌ను కేవలం రూ.44,507 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ ధర)కే బజాజ్ ఆటో విడుదల చేసింది.

బజాజ్ ప్లాటినా ఈఎస్ మోటార్‌సైకిల్‌లో కొత్త 102సీసీ, సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్‌లో బజాజ్ పాపులర్ డిటిఎస్ఐ టెక్నాలజీని మరియు ఎగ్జాస్‌టెక్ టెక్నాలజీని ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 8 బిహెచ్‌పిల శక్తిని, 8.7 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇదే తరహా ఇంజన్‌ను డిస్కవర్ 100ఎమ్ మోటార్‌సైకిల్‌లో ఉపయోగించారు.
డిజైన్ పరంగా చూస్తే.. కొత్త ప్లాటినా ఈఎస్ మోడల్ ప్రస్తుత ప్లాటినా మాదిరిగానే కనిపిస్తుంది. కాకపోతే ఇందులో కొత్త సైడ్ ప్యానెల్స్, కొత్త ఎగ్జాస్ట్, కొంచెం విభిన్నంగా ఉండే హెడ్‌ల్యాంప్స్, కొత్త గ్రాఫిక్స్ వంటి మార్పులను చూడొచ్చు. ఇకపోతే, ఇందులో ప్రధానమైన మార్పు, ఇది ఎలక్ట్రిక్ స్టార్ట్ ఫీచర్‌తో లభ్యమవుతుంది.


Click it and Unblock the Notifications







