అత్యంత వేగవంతమైన 'బజాజ్ పల్సర్ ఆర్ఎస్200' వస్తోంది!

By Ravi

దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో అందిస్తున్న పాపులర్ పల్సర్ బ్రాండ్‌లో మరిన్ని కొత్త వేరియంట్లు మార్కెట్లోకి రానున్నట్లు మనం ఇదివరకటి కథనాల్లో చదువుకున్నాం. వీటిలో ముందుగా 'పల్సర్ ఆర్ఎస్200' (Pulsar RS200) అనే కొత్త స్పోర్ట్స్ బైక్ మార్కెట్లోకి రానుంది.

ఈ మేరకు కంపెనీ అధికారిక టీజర్ ఫొటోను కూడా విడుదల చేసింది. మరికొద్ది రోజుల్లో ఈ సరికొత్త బజాజ్ పల్సర్ ఆర్ఎస్200 కస్టమర్లను చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం పల్సర్ సిరీస్‌లో లభిస్తున్న బైక్‌లలో కెల్లా ఈ కొత్త పల్సర్ ఆర్ఎస్200 అత్యంత వేగవంతమైనదిగా ఉంటుందని సమాచారం.

Bajaj Pulsar RS 200

మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, కొన్ని నగరాల్లో ఇప్పటికే డీలర్లు కొత్త బజాజ్ పల్సర్ ఆర్ఎస్200 కోసం బుకింగ్‌లను కూడా స్వీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బజాజ్ విక్రయిస్తున్న పల్సర్ 200ఎన్ఎస్‌లో ఉపయోగిస్తున్న ఇంజన్‌నే ఈ కొత్త పల్సర్ ఆర్ఎస్200లోను ఉపయోగించే అవకాశం ఉంది.

అయితే, బెటర్ పెర్ఫార్మెన్స్ కోసం ఈ ఇంజన్‌ను ట్యూనింగ్ చేసే అకాశం కూడా ఉంది. పల్సర్ 200ఎన్ఎస్‌లోని 199.5సీసీ, సింగిల్ సిలిండర్, 3-స్పార్క్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్ గరిష్టంగా 24.4 పిఎస్‌ల శక్తిని, 18.6 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

Bajaj Pulsar RS 200 Launching Soon In India

More from DriveSpark

Article Published On: Tuesday, March 17, 2015, 9:44 [IST]
English summary
India has been patiently waiting for a new Pulsar to be launched from the stables of Bajaj Auto. There was confusion as to which of their models would be introduced. They have now confirmed through their fanpage that the upcoming launch will be of a Pulsar RS 200.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+