మహీంద్రా గస్టో స్కూటర్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు
మహీంద్రా టూవీలర్స్ మొట్టమొదటి సారిగా తామే స్వతాహాగా అభివృద్ధి చేసిన 'గస్టో' (Gusto) స్కూటర్‌ను కంపెనీ నేడు (సెప్టెంబర్ 29, 2014) మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో 'మహీంద్రా గస్టో' స్కూటర్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. వాటి ధరలు ఇలా ఉన్నాయి:
* మహీంద్రా గస్ట్ డిఎక్స్ - రూ.43,000
* మహీంద్రా గస్ట్ విఎక్స్ - రూ.47,000
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).
ఇవి ప్రారంభోత్సవ ధరలు మాత్రమేనని, దీపావళి వరకు మాత్రమే ఈ ధరలు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది.

మహీంద్రా గస్టో స్కూటర్ ప్రస్తుతానికి పశ్చిమ, ఉత్తర భారతదేశంలో మాత్రమే లభ్యం కానుంది. మరికొద్ది నెలల్లోనే ఈ స్కూటర్‌ను భారతదేశంలోని ఇతర మార్కెట్లతో పాటు సౌత్ ఏషియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా వంటి ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేస్తామని కంపెనీ పేర్కొంది.
మహీంద్రా టూవీలర్స్ అభివృద్ధి చేసిన గస్టో స్కూటర్ ఓ గ్లోబల్ స్కూటర్. అంటే ఇది కేవలం ఇండియన్ మార్కెట్లోనే కాకుండా పలు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా లభ్యం కానుంది. ఈ స్కూటర్‌ను అధునాతన ఇంజనీరింగ్ ఫీచర్లతో ఇటలీలో అభివృద్ధి చేశారు. మహీంద్రా గస్టో స్కూటర్‌లో అధునాతన ఎమ్-టెక్ ఇంజన్‌ను ఉపయోగించారు.

ఈ స్కూటర్‌లో ఉపయోగించిన 109.6సీసీ, 4-స్ట్రోక్, ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 8.0 బిహెచ్‌పిల శక్తిని, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 9 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ సివిటి ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.
గస్టో స్కూటర్ పూర్తి అల్యూమినియం ఎమ్-టెక్ ఇంజన్‌తో పాటుగా దృఢమైన క్రాంక్‌షాఫ్ట్ మరియు బేరింగ్స్, అధిక జడత్వం కలిగిన మాగ్నెటో, అత్యధిక శక్తి కలిగిన హెచ్‌టి కాయిల్ మరియు సిరీస్ రెగ్యులేటర్‌ల వలన గస్టో స్కూటర్ బెటర్ పవర్‌ను, మైలేజీని మరియు విశ్వసనీయతను ఆఫర్ చేస్తుందని కంపెనీ వివరించింది.

ఇందులో ముందు వైపు టెలిస్కోపిక్, వెనుక వైపు హైడ్రాలిక్ సస్పెన్షన్‌ను ఉపయగించారు. దక్షిణ భారతదేశంలో ఇది జవరి నుంచి అందుబాటులో ఉంటుందని మహీంద్రా టూవీలర్స్ పేర్కొంది. ఇది మొత్తం ఆరు రంగులలో (ఐస్‌బర్గ్ వైట్, గలాక్టిక్ బ్లాక్, మాగ్నటిక్ మాగ్నెటా, వొల్కానో రెడ్, ఆర్కిటిక్ వైట్, రావెన్ బ్లాక్) లభిస్తుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








