టీవీఎస్ వెగో ఫేస్‌లిఫ్ట్ విడుదల; ధరలో మార్పు లేదు!
టీవీఎస్ మోటార్ కంపెనీ గడచిన 2014 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన రిఫ్రెష్డ్ టీవీఎస్ వెగో స్కూటర్‌ను సైలెంట్‌గా మార్కెట్లో విడుదల చేసింది. టీవీఎస్ వెగో మరింత ఆకర్షనీయంగా, ఫ్రెష్‌గా కనిపించేందుకు వీలుగా ఈ స్కూటర్‌లో కొన్ని మార్పులు చేర్పులు చేశారు.
కొత్త టీవీఎస్ వెగో స్కూటర్ ఇప్పుడు డ్యూయెల్ టోన్ కలర్ ఆప్షన్లతో లభిస్తుంది. ఆల్ బ్లాక్ అల్లాయ్ వీల్స్ ఈ స్కూటర్‌కు మరింత యూత్‌ఫుల్ లుక్‌నిస్తాయి. రీడిజైన్ చేయబడిన సీట్, డిజిటల్ స్పీడోమీటర్, జూపిటర్ స్కూటర్ నుంచి గ్రహించిన సైలెన్సర్ లేఅవుట్ వంటి మార్పుల చేర్పులను ఈ కొత్త 2014 టీవీఎస్ వెగో స్కూటర్‌లో గమనించవచ్చు.

కేవలం కాస్మోటిక్ మార్పులు మాత్రమే కాకుండా మెకానికల్ చేంజెస్‌ను కూడా కొత్త వెగోలో చేశారు. టీవీఎస్ జూపిటర్ స్కూటర్‌లోని ఇంజన్ మాదిరిగానే ఈ కొత్త 2014 టీవీఎస్ వెగో స్కూటర్‌లోని ఇంజన్ కూడా ఇప్పుడు 8 హెచ్‌పిల శక్తిని, 8 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రీఫైన్డ్ 110సీసీ ఇంజన్ లీటరుకు 62 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.

కొత్త 2014 టీవీఎస్ వెగో స్కూటర్‌లో ఇన్ని చెప్పుకోదగిన మార్పులు చేర్పులు చేసినప్పటికీ, దీని ధరలో మాత్రం కంపెనీ ఎలాంటి మార్పు చేయలేదు. డ్రమ్ బ్రేక్ వెర్షన్ టీవీఎస్ వెగో స్కూటర్ ధర రూ.48,857గా ఉండగా, ఆప్షనల్ డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ.49,580గా ఉంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ముంబై).


Click it and Unblock the Notifications








