వెస్పా ఎలిగాంట్ స్కూటర్ విడుదల; ధర, ఫీచర్లు, వివరాలు

By Ravi

ఇటాలియన్ ఆటోమొబైల్ బ్రాండ్ పియాజ్జియో, ఈనెల 16వ తేదీన తమ వెస్పా బ్రాండ్‌లో 'వెస్పా ఎలిగాంట్' (Vespa Elegante) పేరుతో ఓ సరికొత్త స్కూటర్‌ను ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, వెస్పా ఎలిగాంట్ స్కూటర్ ధర, ఫీచర్లు, ఇంజన్ వివరాలను కంపెనీ వెల్లడి చేసింది.

పియాజ్జియో గతంలో విడుదల చేసిన వెస్పా ఎస్‌క్లూజివో మాదిరిగానే వెస్పా ఎలిగాంట్ కూడా ఓ లిమిటెడ్ ఎడిషన్ మోడల్. ఈ మోడల్ ఎక్స్‌క్లూజివిటినీ ప్రదర్శించేందుకు గాను ఇందులో ఓ ప్రత్యేకమైన ఎలిగాంట్ బ్యాడ్జ్‌ను అమర్చారు. వెస్పా ఎలిగాంట్ స్కూటర్ కేవలం రెండు కలర్ ఆప్షన్లలో మాత్రమే లభ్యం కానుంది.

వెస్పా ఎలిగాంట్ స్కూటర్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

వెస్పా ఎలిగాంట్ స్కూటర్ విడుదల

తర్వాతి స్లైడ్‌లలో వెస్పా ఎలిగాంట్ స్కూటర్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోండి.

వెస్పా ఎలిగాంట్ స్కూటర్ విడుదల

వెస్పా ఎలిగాంట్ స్కూటర్ ఓ లిమిటెడ్ ఎడిషన్ మోడల్. కేవలం రెండు నెలల కాలం పాటు 3500 యూనిట్ల వెస్పా ఎలిగాంట్ స్కూటర్లను మాత్రమే విక్రయించాలని కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఒకవేళ ఈ మోడల్‌కు డిమాండ్ ఎక్కువగా ఉంటే, ఈ సంఖ్యను పెంచే అవకాశం ఉంది.

వెస్పా ఎలిగాంట్ స్కూటర్ విడుదల

వెస్పా ఎలిగాంట్ లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్ కేవలం రెండు రంగులలో మాత్రమే లభిస్తుంది. ఇతర వెస్పా మోడళ్లతో పోల్చితే, ఎలిగాంట్‌ను భిన్నంగా ఉంచేందుకు కంపెనీ ఈ స్కూటర్ చుట్టూ క్రోమ్ సరౌండింగ్‌ను ఆఫర్ చేస్తుంది.

వెస్పా ఎలిగాంట్ స్కూటర్ విడుదల

వెస్పా ఎలిగాంట్ స్కూటర్‌లో స్ప్లిట్ సీట్స్ ఉంటాయి. వైట్ కలర్ స్కూటర్‌పై రెడ్ సీట్స్, బ్రౌన్ కలర్ స్కూటర్‌పై బీజ్ సీట్స్ ఉంటాయి. ఈ సీట్లు లెథర్ ఫినిష్‌ను కలిగి ఉంటాయి.

వెస్పా ఎలిగాంట్ స్కూటర్ విడుదల

వెస్పా ఎలిగాంట్‌లో ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న ఇతర వెస్పా స్కూటర్లలో ఉపయోగిస్తున్న 125సీసీ ఇంజన్‌నే ఉపయోగించింది. ఈ ఇంజన్ గరిష్టంగా 10.5 బిహెచ్‌పిల శక్తిని, 10.6 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కంటిన్యూస్ వేరియబల్ ట్రాన్సిమిషన్ (సివిటి) గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది.

వెస్పా ఎలిగాంట్ స్కూటర్ విడుదల

వెస్పా ఎలిగాంట్ స్కూటర్‌లో ముందు వైపు డిస్క్ బ్రేక్ స్టాండర్డ్‌గా లభిస్తుంది. అల్లాయ్ వీల్స్, ట్యూబ్‌లెస్ టైర్లను కూడా ఇందులో స్టాండర్డ్‌గా ఆఫర్ చేస్తున్నారు.

వెస్పా ఎలిగాంట్ స్కూటర్ విడుదల

వెస్పా ఎలిగాంట్ స్కూటర్ బాడీ కలర్‌తో మ్యాచ్ అయ్యేలా, అదే పెయింట్ ఫినిష్‌తో కూడిన హెల్మెట్లను కూడా పియాజ్జియో ఆఫర్ చేస్తోంది. బ్రౌన్ కలర్ స్కూటర్ కోసం ఉద్దేశించిన బ్రౌన్ కలర్ హెల్మెట్‌ను ఈ ఫొటోలో చూడొచ్చు.

వెస్పా ఎలిగాంట్ స్కూటర్ విడుదల

వైట్ కలర్ స్కూటర్ కోసం ఉద్దేశించిన వైట్ కలర్ హెల్మెట్‌ను ఈ ఫొటోలో చూడొచ్చు.

More from DriveSpark

Article Published On: Friday, September 26, 2014, 8:20 [IST]
English summary
The Vespa Elegante was launched today by the Italian two wheeler manufacturer, Piaggio. The Elegante is the latest addition to the Vespa line up. The Italian automaker had earlier unveiled the scooter on the 16th of September.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+