హెల్మెట్ మార్కెట్‌పై కన్నేసి వాచ్ మేకర్ 'టైటాన్'
భారతదేశపు ప్రముఖ ఘడియారాలు, ఆభరణాలు మరియు కళ్లజోళ్ల తయారీ సంస్థ టైటాన్ (Titan) ఇప్పుడు హెల్మెట్ల తయారీపై దృష్టి సారించింది. బైకర్లు, మోటారిస్టుల భద్రత కోసం ప్రీమియం లుక్ కలిగిన హెల్మెట్లను తయారు చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది.
ఈ విషయంపై టైటాన్ మేనేజింగ్ డైరెక్టర్ భాస్కర్ భట్ మాట్లాడుతూ.. రీటైల్ రంగంలో వివిధ విభాగాల్లోకి ప్రవేశించాలన్న తమ ప్రణాళికలో భాగంగా, 2014 ఆరంభంలో హెల్మెట్ మార్కెట్లోకి ప్రవేశిస్తామని, ద్విచక్ర వాహన చాలకుల సౌకర్యం, భద్రతల కోసం అత్యంత నాణ్యమైన ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకువస్తామని ఆయన చెప్పారు.
టైటాన్ ఉత్పత్తుల నాణ్యతకు పెట్టింది పేరు. ఈ నేపథ్యంలో టైటాన్ నుంచి రానున్న హెల్మెట్లు కూడా అంతే నాణ్యతను కలిగి ఉంటాయని తెలుస్తోంది. భారత మార్కెట్లో ఇప్పటికే అనేక హెల్మెట్ తయారీ సంస్థలు ఉన్నప్పటికీ, వారు అందిస్తున్న ఉత్పత్తులు మోటార్‌బైక్ రైడర్లకు పర్యవారణ సాన్నిహిత్యమైనవి కావు.
భారత్ లాంటి ఉష్ణమండల వాతావరణ పిరిస్థితులు కలిగిన మార్కెట్లో ఈకో-ఫ్రెండ్లీ హెల్మెట్లను ఆఫర్ చేస్తున్న కంపెనీలు లేవని, అందుకే తాము కస్టమర్ల భద్రత కోసమే కాకుండా, అన్ని వాతావరణాల్లో వారికి సౌకర్యం కలిగించేలా హెల్మెట్లను డిజైన్ చేసి, ఇంజనీర్ చేస్తామని భట్ చెప్పారు.



Click it and Unblock the Notifications








