టీవీఎస్ బ్రాండ్ అంబాసిడర్‌గా సూపర్ స్టార్ మహేష్

టాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాధించుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుటు టీవీఎస్ మోటార్‌సైకిళ్లకు ప్రచారకర్తగా వ్యవహరించనున్నాడు. చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ మహేష్ బాబును తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంటున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.

ఈ ఒప్పందంలో భాగంగా, మహేష్ బాబు తొలుతగా, టీవీఎస్ ఇటీవలే మార్కెట్లో ప్రవేశపెట్టిన 125సీసీ బైక్ 'ఫినిక్స్' బైక్‌కు ప్రచారం చేయనున్నారు. అనతరం, అన్ని టీవీఎస్ మోటార్‌సైకిళ్లకు మహేష్ ప్రచారం చేసే ఆస్కారం ఉంది. ఇది తనకు ఒక థ్రిల్లింగ్ అనుభూతి అని, త్వరలోనే కమర్షియల్ షూటింగ్ ప్రారంభమవుతుందని మహేష్ బాబు తెలిపారు.

టీవీఎస్ ఇప్పటికే భారత క్రికెట్ కెప్టెన్, మహేంద్ర సింగ్ ధోనీ, క్రికెటర్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ నటి అనుష్కా శర్మలను తమ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్న సంగతి తెలిసినదే.

టీవీఎస్ ఫినిక్స్ గురించి..
టీవీఎస్ మోటార్ కంపెనీ గడచిన సంవత్సరం చివర్లో తమ 125సీసీ ఎగ్జిక్యూటివ్ మోటార్‌సైకిల్ 'ఫినిక్స్'ను బడ్జెట్‌ ధరకే, ఎగ్జిక్యూటివ్ రైడ్ కోరుకునే వారిని దృష్టిలో ఉంచుకొని విడుదల చేసింది. ఇది తక్కువ బరువు (డ్రమ్ బ్రేక్ వెర్షన్ బరువు 114 కేజీలు, డిస్క్ బ్రేక్ వెర్షన్ బరువు 116 కేజీలు)ను కలిగి ఉండి లీటర్ పెట్రోల్‌కు 67 కి.మీ. మైలేజీని (స్టాండర్డ్ రైడింగ్ కండిషన్స్ ప్రకారం) ఆఫర్ చేస్తుంది. ఇందులో 125సీసీ ఇంజన్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 11 పిస్‌ల శక్తిని, 10 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 4-స్పీడ్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో జతచేయబడి ఉంటుంది. మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలిద్దాం రండి..!

టీవీఎస్ బ్రాండ్ అంబాసిడర్‌గా మహేష్

టాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాధించుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుటు టీవీఎస్ మోటార్‌సైకిళ్లకు ప్రచారకర్తగా వ్యవహరించనున్నాడు.

టీవీఎస్ బ్రాండ్ అంబాసిడర్‌గా మహేష్

చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ మహేష్ బాబును తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంటున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.

టీవీఎస్ బ్రాండ్ అంబాసిడర్‌గా మహేష్

ఈ ఒప్పందంలో భాగంగా, మహేష్ బాబు తొలుతగా, టీవీఎస్ ఇటీవలే మార్కెట్లో ప్రవేశపెట్టిన 125సీసీ బైక్ 'ఫినిక్స్' బైక్‌కు ప్రచారం చేయనున్నారు.

టీవీఎస్ బ్రాండ్ అంబాసిడర్‌గా మహేష్

ఇది తనకు ఒక థ్రిల్లింగ్ అనుభూతి అని, త్వరలోనే కమర్షియల్ షూటింగ్ ప్రారంభమవుతుందని మహేష్ బాబు తెలిపారు.

ఓవర్‌వ్యూ:

ఓవర్‌వ్యూ:

టీవీఎస్ మోటార్ కంపెనీ అందిస్తున్న ఫ్లేమ్ మోటార్‌సైకిల్ స్థానాన్ని భర్తీ చేస్తూ కంపెనీ ఓ విడుదల చేసిన ప్రీమియం 125సీసీ మోటార్‌సైకిల్ టీవీఎస్ ఫినిక్స్. శక్తివంతమైన పెర్ఫామెన్స్, మెరుగైన మైలేజ్, ఆకట్టుకునే డిజైన్ వంటి ఫీచర్లతో కంపెనీ ఈ ఎగ్జిక్యూటివ్ మోటార్‌సైకిల్‌ను అభివృద్ధి చేసింది.

డ్యూయెల్ టోన్ గ్రాఫిక్స్:

డ్యూయెల్ టోన్ గ్రాఫిక్స్:

టీవీఎస్ ఫినిక్స్ 125 మోటార్‌సైకిల్ డ్యూయెల్ టోన్ (రెండు రంగల కలయిక) కలర్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఇది స్టయిలిష్ బాడీ గ్రాఫిక్స్‌ను కలిగి ఉండి చూపరలను ఇట్టే ఆకట్టుకుంటుంది. మొరాకన్ రెండ్, అలస్కా గ్రీన్, హెల్సిన్కీ బ్లాక్ సిల్వర్, బెల్జియన్ బ్లాక్ రెడ్, ఆక్స్‌ఫర్డ్ గ్రే రంగుల్లో ఇది లభిస్తుంది.

ఎల్ఈడి పైలట్ ల్యాంప్స్:

ఎల్ఈడి పైలట్ ల్యాంప్స్:

హెడ్‌లైట్‍‌కు పైభాగంలో రెండు చివర్లలో అమర్చిన ఎల్ఈడి పైలట్ ల్యాంప్స్ బైక్‌కు మంచి స్టయిలిష్‌ లుక్‌నిస్తాయి. బైక్‌కు కళ్ల మాదిరిగా ఉండే ఈ లైట్లను పగలైనా రాత్రైనా ఆన్ చేసుకోవచ్చు.

ఈకోథ్రస్ట్ ఇంజన్‌:

ఈకోథ్రస్ట్ ఇంజన్‌:

టీవీఎస్ ఫినిక్స్‌లో అమర్చిన 125సీసీ ఇంజన్ గరిష్టంగా 11 పిస్‌ల శక్తిని, 10 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 4-స్పీడ్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఇది లీటర్ పెట్రోల్‌కు 67 కి.మీ. మైలేజీని (స్టాండర్డ్ రైడింగ్ కండిషన్స్ ప్రకారం) ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

హాజర్డ్ లైట్స్:

హాజర్డ్ లైట్స్:

కేవలం కార్లకు మాత్రమే పరిమితమైన హాజర్డ్ లైట్స్ ఇప్పుడు టీవీఎస్ ఫినిక్స్‌లో కూడా లభించనున్నాయి. బైక్‌ను రోడ్డుపై నిలిపినప్పుడు ఎదురుగా, వెనుకగా వచ్చే వాహనాలను అప్రమత్తం చేసేందుకు ఈ హాజర్డ్ లైట్స్ ఉపయోగపడుతాయి. హాజర్డ్ స్విచ్ ఆన్ చేసినప్పుడు బైట్ ఫ్రంట్, రియర్ ఇండికేటర్స్ వెలుగుతూ, ఆరుతూ ఉంటాయి.

డిజిటల్ మీటర్:

డిజిటల్ మీటర్:

ఈ సెగ్మెంట్లో కెల్లా పూర్తిగా డిజిటల్ మీటర్‌తో లభించే మోటార్‌సైకిల్ టీవీఎస్ ఫినిక్స్ మాత్రమే.

రోటో పెటల్ డిస్క్ బ్రేక్స్:

రోటో పెటల్ డిస్క్ బ్రేక్స్:

టీవీఎస్ ఫినిక్స్ 125సీసీ మోటార్‌సైకిల్ డిస్క్ బ్రేక్స్ ఆప్షన్‌తో లభిస్తుంది. డిస్క్ వద్దకునే వారు డ్రమ్ బ్రేక్ వెర్షన్‌ను ఎంచుకోవచ్చు. ఈ ఫ్రంట్ డిస్క్ బ్రేక్ సమర్థవంతమైన బ్రేకింగ్ అనుభూతిని కల్పిస్తుంది.

వేరియంట్స్:

వేరియంట్స్:

టీవీఎస్ ఫినిక్స్ 125సీసీ మోటార్‌సైకిల్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అందులో ఒకటి డ్రమ్ బ్రేక్ వెర్షన్ కాగా మరొకటి డిస్క్ బ్రేక్ వెర్షన్.

కాంపిటీషన్:

కాంపిటీషన్:

ఈ సెగ్మెంట్లో హోండా షైన్, హీరో గ్లామర్, బజాజ్ డిస్కవర్ వంటి మోడళ్లకు ధీటుగా టీవీఎస్ ఫినిక్స్ నిలువనుంది.

టీవీఎస్ బ్రాండ్ అంబాసిడర్‌గా మహేష్

More from DriveSpark

Article Published On: Tuesday, June 11, 2013, 16:24 [IST]
English summary
TVS Motor Company has appointed the Tollywood superstar Mahesh Babu as its brand ambassador. The actor will initially represent with TVS motorcycle Phoenix and later endorse all TVS motorcycle brands. "This will be a thrilling experience for me as I will begin shooting for the commercial soon", said Mahesh Babu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+