యమహా రే ఇప్పుడు స్టేరీ వైట్ కలర్ ఆప్షన్‌తో లభ్యం

By Ravi

జపనీస్ టూవీలర్ దిగ్గజం ఇండియా యమహా మోటార్ భారతీయ మహిళలను లక్ష్యంగా చేసుకొని దేశీయ విపణిలో ప్రవేశపెట్టిన మొట్టమొదటి స్కూటర్ యమహా రే (Yamaha Ray)లో కంపెనీ ఇప్పుడు ఓ కొత్త కలర్ ఆప్షన్‌ను విడుదల చేసింది. యమహా రే స్కూటర్ ఇప్పుడు స్టేరీ వైట్ (Starry White) కలర్‌తో లభ్యం కానుంది. ఈ కలర్ కాకుండా రే స్కూటర్ మరో ఆరు ఆకర్షనీయమైన రంగుల్లో కూడా లభ్యమవుతుంది. అవి: ప్లష్ పింక్, బ్లాక్ స్టార్, షైనింగ్ బ్లూ, బర్గండి బ్లిస్, పర్పల్ పేస్టెల్ మరియు గ్రే గాండ్యూర్.

భారత మార్కెట్లో రే స్కూటర్ యమహా ప్రోడక్ట్ పోర్ట్ ఫోలియో నుంచి లభిస్తున్న మొట్టమొదటి స్కూటర్. ఈ స్కూటర్ విడుదల ద్వారా యమహా దేశీయ విపణిలో స్కూటర్ సెగ్మెంట్లోకి ప్రవేశించింది. యమహా ఈ స్కూటర్‌ను తొలిసారిగా గడచిన సంవత్సరం జనవరిలో జరిగిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు ఉంచింది. ఆ తర్వాత సెప్టెంబర్ నెలలో యమహా రేను వాణిజ్య పరంగా మార్కెట్లో విడుదల చేసింది. ఇది ఈ సెగ్మెంట్లోని హోండా, టీవీఎస్, సుజుకి కంపెనీలు అందిస్తున్న పవర్‌ఫుల్, స్టయిలిష్ స్కూటర్లకు గట్టి పోటీ ఇస్తోంది.

యమహా రే - కలర్ ఆప్షన్స్

యమహా రే - కలర్ ఆప్షన్స్

యమహా రే స్కూటర్ ఇప్పుడు స్టేరీ వైట్ (Starry White) కలర్‌తో లభ్యం కానుంది.

యమహా రే - కలర్ ఆప్షన్స్

యమహా రే - కలర్ ఆప్షన్స్

స్టేరీ వైట్ (Starry White)

యమహా రే - కలర్ ఆప్షన్స్

యమహా రే - కలర్ ఆప్షన్స్

ప్లష్ పింక్ (Plush Pink)

యమహా రే - కలర్ ఆప్షన్స్

యమహా రే - కలర్ ఆప్షన్స్

బ్లాక్ స్టార్ (Black Star)

యమహా రే - కలర్ ఆప్షన్స్

యమహా రే - కలర్ ఆప్షన్స్

షైనింగ్ బ్లూ (Shining Blue)

యమహా రే - కలర్ ఆప్షన్స్

యమహా రే - కలర్ ఆప్షన్స్

బర్గండి బ్లిస్ (Burgundy Bliss)

యమహా రే - కలర్ ఆప్షన్స్

యమహా రే - కలర్ ఆప్షన్స్

పర్పల్ పేస్టెల్ (Purple Pastel)

యమహా రే - కలర్ ఆప్షన్స్

యమహా రే - కలర్ ఆప్షన్స్

గ్రే గ్రాండ్యూర్ (Grey Grandeur)


యమహా రే స్కూటర్‌లో ఉపయోగించిన 113సీసీ ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, ఎస్ఓహెచ్‌సి, 2-వాల్వ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 7. పిఎస్‌ల శక్తిని, 5000 ఆర్‌పిఎమ్ వద్ద8.1 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఇది లీటరుకు 61.1 కి.మీ. మైలేజీనిస్తుంది (స్టాండర్డ్ రైడింగ్ నిబంధనల ప్రకారం). దీని ఇంధన ట్యాంక్ సామర్థ్యం 5 లీటర్లు. యమహా రే స్కూటర్ రెండేళ్లు లేదా 24,000 కి.మీ. (ఏది ముందు మగిస్తే అది) వారంటీతో లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో యమహా రే ఎక్స్-షోరూమ్ ధర రూ.46,500 లుగా ఉంది.

More from DriveSpark

Article Published On: Friday, January 11, 2013, 10:21 [IST]
English summary
Yamaha has recently introduced a new colour option for its flagship scooter Yamaha Ray. Now the Yamaha Ray is available in Starry White paint shade along with Plush Pink, Black Star, Shining Blue, Burgundy Bliss, Pastel Purple and Grey Grandeur.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+