భారీగా పెంచిన పెట్రోల్ ధర; డీజిల్‌ను కూడా వదల్లేదు!

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు శనివారం (31.08.2013) అర్థరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. గడచిన రెండు నెలల్లో ఇలా పెట్రోల్ ధరలు పెరగటం ఇది 56వ సారి. కాగా.. జనవరి 17 నుంచి డీజిల్ ధరలు పెరగటం ఇది 8వ సారి.
డాలర్ మారకంతో పోల్చుకుంటే రుపాయి విలువ రోజురోజుకి క్షీణిస్తుండటంతో, ముడిచమురు ధరలు పెరిగి, తమపై అధనపు భారం పడుతున్న కారణంగానే పెట్రోల్ ధరలను పెంచాల్సి వచ్చింది. భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ పేర్కొంది.
తాజా పెంపు తర్వాత దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి:
- ఢిల్లీ - రూ.74.1 (పెట్రోల్); రూ.51.97 (డీజిల్)
- ముంబై - రూ.81.57 (పెట్రోల్); రూ.58.86 (డీజిల్)
- కలకత్తా- రూ.81.57 (పెట్రోల్); రూ.56.33 (డీజిల్)
- చెన్నై - రూ.77.48 (పెట్రోల్); రూ.55.37 (డీజిల్)


Click it and Unblock the Notifications








