హీరో ఎలక్ట్రిక్ నుంచి ఫోటాన్ స్కూటర్ విడుదల

By Ravi

భారతదేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌కు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ విభాగం హీరో ఎలక్ట్రిక్ ఓ సరికొత్త హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను దేశీయ విపణిలో విడుదల చేసింది. 'ఫోటాన్' (Photon) పేరుతో హీరో ఎలక్ట్రిక్ విడుదల చేసిన ఈ స్కూటర్ ధర రూ.57,790(ఎక్స్-షోరూమ్, మహారాష్ట్ర)గా ఉంది.

భారతదేశంలోని అన్ని ప్రధాన మెట్రో నగరాల్లో తమ ఫోటాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. హీరో ఎలక్ట్రిక్ అందిస్తున్న అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్ల కన్నా ఇదే అత్యంత వేగవంతమైనది. దీని గరిష్టం వేగం గంటకు 45 కిలోమీటర్లు.

హీరో ఫోటాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు డ్రైవింగ్ మోడ్స్‌తో లభిస్తుంది. అవి - ఎకానమీ, పవర్. ఎకానమీ మోడ్‌లో రైడ్ చేస్తే ఈ స్కూటరులోని బ్యాటరీ ఫుల్ చార్జ్‌పై 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. అలాగే పవర్ మోడ్‌లో రైడ్ చేస్తే దీనిపై 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.

Photon Scooter

హీరో ఫోటాన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఫ్రంట్ టెలిస్కోప్ సస్పెన్షన్, డిస్క్ బ్రేక్, యాంటీ-థెఫ్ట్ అలారమ్, ధృడమైన స్టీల్ బాడీ వంటి విశిష్టతలున్నాయి. ఇందులో ఓ హై టార్క్ కంట్రోలర్ కూడా ఉంటుంది. ఇది చూడటానికి రెగ్యులర్ స్కూటర్ల మాదిరిగానే ఉంటుంది.

ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్ల మాదిరిగా కాకుండా హీరో ఫోటాన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు రిజిస్ట్రేషన్ అవసరం (టాప్ స్పీడ్ 25 కెఎమ్‌పిహెచ్‌కు దిగువన ఉండే ఎలక్ట్రిక్ వాగనాలకు రిజిస్ట్రేషన్ అవసరం ఉండదు). ఇందులో విఆర్ఎల్ఏ 33 ఏహెచ్/48వోల్ట్ బ్యాటరీని ఉపయోగించారు. ఈ స్కూటర్ కేవలం నలుపు రంగులో మాత్రమే లభిస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, August 14, 2014, 11:34 [IST]
English summary
Hero MotoCorp's electric vehicle division Hero Electric has launched a new and trendy electric scooter. Hero Electric has christened its new electric scooter as the 'Photon'. The electric scooter has been priced at INR 52,790 in Maharashtra.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+