సెప్టెంబర్ 16, 2014వ తేదీన వెస్పా ఎలిగాంట్ స్కూటర్ విడుదల
ఇటాలియన్ బ్రాండ్ పియాజ్జియో భారత మార్కెట్లో తమ వెస్పా స్కూటర్ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలినియోను విస్తరించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం పియాజ్జియో భారత విపణిలో వెస్పా ఎల్క్125, వెస్పా విఎక్స్125 మరియు వెస్పా ఎస్ అనే మూడు స్కూటర్లను విక్రయిస్తున్న సంగతి తెలిసినదే. వీటికి తోడుగా పియాజ్జియో మరో క్లాసిక్-మోడ్రన్ ప్రీమియం స్కూటర్‌ను ఈనెలలో విడుదల చేయనుంది
'వెస్పా ఎలిగాంట్' (Vespa Elegante) పేరుతో ఓ సరికొత్త స్కూటర్‌ను పియాజ్జియో ఈనెల 16వ తేదీన భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ స్కూటర్ విడుదల ఇతర వెస్పా స్కూటర్ల మాదిరిగానే క్లాసిక్ డిజైన్‌తో పాటుగా మోడ్రన్ టెక్నాలజీలను కలిగి ఉండనుంది. ఇందులో కూడా ఇది ప్రస్తుత 125సీసీ ఇంజన్‌నే ఉపయోగించనున్నట్లు సమాచారం.

ఈ ఇంజన్ గరిష్టంగా 9.91 హార్స్ పవర్‌ల శక్తిని, 10.6 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కంటిన్యూస్ వేరియబల్ ట్రాన్సిమిషన్ (సివిటి) గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. వెస్పా అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తున్న ఉత్పత్తుల నుంచి స్ఫూర్తి పొంది ఎలింగాంట్‌ను డిజైన్ చేసే అవకాశం ఉంది. ఇందులో విశిష్టమైన ట్రయాంగ్యులర్ హెడ్‌లైట్ ఉంటుంది.
ప్రీమియం టచ్ కోసం ఇందులో ఎక్కువ క్రోమ్ గార్నిష్ చేయనున్నారు. ఇందులో డిస్క్ బ్రేక్స్ స్టాండర్డ్ ఫీచర్‌గా లభించే అవకాశం ఉంది. బెటర్ రోడ్ గ్రిప్ కోసం మల్టీ స్పోక్ అల్లాయ్ వీల్స్, ట్యూబ్‌లెస్ టైర్స్ ఉంటాయి. ఇది బ్లూ, వైట్, యెల్లో కలర్ ఆప్షన్లలో లభ్యం కావచ్చని సమాచారం. ధర విషయానికి వస్తే ఇది సుమారు రూ.80,000 ఉండొచ్చని అంచనా. వెస్పా రేంజ్‌లో కెల్లా ఇదే అత్యంత ఖరీదైన మోడల్ కానుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








