వెస్పా ఎస్‌క్లూజివో లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్ విడుదల
భారత్‌లో వెస్పా బ్రాండ్ ప్రీమియం స్కూటర్లను విక్రయిస్తున్న ఇటాలియన్ కంపెనీ పియాజియో వెహికిల్స్, తాజాగా తమ వెస్పా సిరీస్‌లో ఓ లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసింది. 'వెస్పా ఎస్‌క్లూసివో' (Vespa Esclusivo) అనే పేరుతో కంపెనీ ఈ స్పెషల్ ఎడిషన్ వెస్పా స్కూటర్‌ను ప్రవేశపెట్టింది.
దేశీయ విపణిలో ఈ లిమిటెడ్ ఎడిషన్ వెస్పా ధర రూ.74,355 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. కేవలం 1000 యూనిట్ల లిమిటెడ్ ఎడిషన్ వెస్పా ఎస్‌క్లూజివో స్కూటర్లు మాత్రమే అందుబాటులో ఉంటాయని, ప్రతి స్కూటర్‌పై దాని యూనిట్ నెంబర్ బ్యాడ్జ్ ఉంటుందని పియాజ్జియో వెహికల్స్ ఓ ప్రకటనలో పేర్కొంది.

లిమిటెడ్ ఎడిషన్ వెస్పా ఎస్‌క్లూజివో స్కూటర్‌కు రెగ్యులర్ వెస్పా స్కూటర్‌కు మధ్య వ్యత్యాసాన్ని చూపే విధంగా దీనిని డ్యూయెల్ కలర్, బ్లాక్ అండ్ సిల్వర్ అల్లాయ్ వీల్స్‌తో ఆఫర్ చేస్తున్నారు. గ్రే టాప్ అండ్ బ్లాక్ సైడ్ థీమ్ సీట్ ఇందులో మరో ప్రత్యేకత.
వెస్పా ఎస్‌క్లూజివో లిమిటెడ్ ఎడిషన్ మోడల్ మొత్త మూడు రంగులలో లభిస్తుంది. అవి - మోట్ బియాంకో (తెలుపు), నీరో మ్యాట్ (నలుపు), రోసో డ్రాగన్ (ఎరుపు). పూనే, హైదరాబాద్, బెంగుళూరు తదితర నగరాల్లో నిర్వహించిన ప్రత్యేక ప్రదర్శనలలో ఎస్‌క్లూజివో మోడల్‌ను ప్రదర్శనకు ఉంచారు.


Click it and Unblock the Notifications








