ఆటో ఎక్స్‌పో 2014: వెస్పా లిబర్టీ స్కూటర్ ఆవిష్కరణ

By Ravi

బజాజ్ ఎమ్80 వంటి పెద్ద చక్రాలు కలిగిన స్కూటర్ లాంటి మోటార్‌సైకిళ్లు మనకేం కొత్త కాదు. ఒకప్పుడు ఇలాంటి ద్విచక్ర వాహనాలను మనం రోడ్లపై చూశాం. కానీ కాలక్రమంలో అవి చరిత్రలో కలిసిపోయాయి. అయితే, వీటికి మళ్లీ పునఃజ్జీవం పోసేందుకు ఇటాలియన్ ఆటోమొబైల్ కంపెనీ పియాజ్జియో సిద్ధమైంది. ఇటీవలే ముగిసిన ఆటో ఎక్స్‌పో 2014లో పియాజ్జియో పెద్ద చక్రాలతో కూడిన ఓ సరికొత్త స్కూటర్‌ను ఆవిష్కరించింది.

పియాజ్జియో ఆవిష్కరించిన ఈ స్కూటర్ పేరు 'లిబర్టీ 125 సివి'. యూరప్ మార్కెట్లలో ఈ మోడల్‌కు మంచి పాపులారిటీ ఉంది. అక్కడి మార్కెట్లలో లిబర్టీ స్కూటర్ అమ్మకాలు 10 లక్షల మార్కును దాటాయి. ఇది కూర్చోవటానికి సౌకర్యవంతమైన సీట్‌ను కలిగి ఉండి, విశాలమైన ఫుట్ రెస్ట్‌ను కలిగి ఉంటుంది. సీట్ క్రింద విశాలమైన స్టోరేజ్ స్పేస్, 7 లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్ సిటీ లిమిట్స్‌లో లాంగ్ రైడ్‌లకు సూట్ అయ్యే సీటింగ్ పొజిషన్‌లు దీని ప్రత్యేకతలు.


పియాజ్జియో లిబర్టీ స్కూటర్ 1935 మి.మీ. పొడవును, 760 మి.మీ. వెడల్పును మరియు 1325 మి.మీ. ఎత్తును కలిగి ఉంటుంది. దీని సీట్ హైట్ 795 మి.మీ. దీని రెండు చక్రాలు సమానంగా ఉండవు. ముందు వైపు 16 ఇంచ్ వీల్, వెనుక వైపు 14 ఇంచ్ వీల్స్ ఉంటాయి. ఈ పెద్ద చక్రాల వలన లిబర్టీ స్కూటర్ సాధారణ స్కూటర్లతో పోల్చుకుంటే, మెరుగైన స్థిరత్వాన్ని, కంట్రోల్‌ను కలిగి ఉంటుంది.
Piaggio Liberty 125

టీవీఎస్ లిబర్టీ స్కూటర్‌లో ఉపయోగించిన 125సీసీ ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ ఇంజన్ గరిష్టంగా 8250 ఆర్‌పిఎమ్ వద్ద 10.85 హెచ్‌పిల శక్తిని, 7250 ఆర్‌పిఎమ్ వద్ద 9.6 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్‌కు అంతర్జాతీయంగా ఉన్న పాపులారిటీని పరిగణలోకి తీసుకుంటే, ఇది ఇండియాలో కూడా మంచి సక్సెస్ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, February 12, 2014, 16:23 [IST]
English summary
Piaggio Liberty 125 CV that was revealed for the first time in India at the Auto Expo 2014. The Liberty measures 1935 mm long, 760 mm wide and 1325 mm high. The seat height is 795mm. The wheels measure 16 inches & 14 inches at the front and rear respectively, offering superior stability and control compared to small wheeled scooters.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+