భారత్‌లోనే ఆప్రిలియా బైక్‌ల అసెంబ్లింగ్; తగ్గనున్న ధరలు

By Ravi

పియాజ్జియోకి చెందిన ఇటాలియన్ పెర్ఫార్మెన్స్ బైక్ తయారీ కంపెనీ 'ఆప్రిలియా', ప్రస్తుతం తమ ఉత్పత్తులను సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో ఇండియాకు దిగుమతి చేసుకొని, ఇక్కడి మార్కెట్లో విక్రయిస్తోంది. ఈ విధానం వలం కంపెనీ తమ ఉత్పత్తులపై అధిక దిగుమతి సుంకాన్ని, ఇతర పన్నుల భారాన్ని భరించాల్సి రావటంతో, తప్పనిసరై వాటి ధరలను కూడా అధికంగానే ఉంచాల్సి వస్తోంది.

ఇది కూడా చదవండి: ఆప్రిలియాతో సందడి చేసిన 'సన్నీ లియోన్'

ఈ నేపథ్యంలో, ఆప్రిలియా తమ ఉత్పత్తులను సికెడి (కంప్లీట్లీ నాక్డ్ డౌన్) రూట్లో విడిభాగాలుగా ఇండియాకు దిగుమతి చేసుకొని ఇక్కడే అసెంబ్లింగ్ చేయాలని యోచిస్తోంది. ఇలా చేయటం వలన దిగుమతి సుంకం తగ్గుతుంది. ఫలితంగా ఆప్రిలియా బైక్‌ల ఉత్పాదక వ్యయం తగ్గి, సరమైన ధరకే వీటిని అందించే అవకాశం ఏర్పడుతుంది.


ఆప్రిలియా భారత్‌లో అసెంబ్లింగ్ చేసే ఉత్పత్తుల కన్నా విదేశాల నుంచి భారత్‌కు దిగుమతి చేసుకునే ఉత్పత్తుల తుది రీటైల్ ధర సుమారు 140 శాతం అధికంగా ఉంటుంది. ప్రస్తుతం ఆప్రిలియా దేశీయ విపణిలో అందిస్తున్న ఆర్ఎస్‌వి4, టువానో వి4, డోర్సోడ్యూరో, మన, ఎస్ఆర్‌వి అనే ఐదు ఉత్పత్తుల ధర సుమారు రూ.10 లక్షలకు పైమాటే. ఫలితంగా ఇవి సగటు లగ్జరీ బైక్ ప్రియులకు అందుబాటులో ఉండటం లేదు. దీంతో కంపెనీ పటిష్టమైన కస్టమర్లను కోల్పోవాల్సి వస్తోంది.

ఇది కూడా చదవండి: హీరో అజిత్ కొత్త బైక్ లవ్ గురించి తెలుసా?

పియాజ్జియో వెహికల్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రవి చోప్రా మాట్లాడుతూ.. ఈ సమస్యకు ఏకైక పరిష్కారం తమ మోటార్‌సైకిళ్లను స్తానికంగా అసెంబ్లింగ్ చేయటమేనని, కంప్లీట్ నాక్-డౌన్ కిట్లుగా ఆప్రిలియా మోటార్‌సైకిళ్లను దిగుమతి చేసుకొని, వాటిని ఇక్కడే అసెంబ్లింగ్ చేయటం ద్వారా సరమైన ధరకే వీటిని అందించవచ్చునని ఆయన తెలిపారు.

Piaggio Could Begin Assembly Of Aprilia In India To Reduce Price

ఆప్రిలియా బ్రాండ్ విస్తరణలో భాగంగా.. చంఢీఘడ్, హైదరాబాద్, బెంగుళూరు మరియు ముంబై నగరాల్లో కూడా షోరూమ్‌లను ప్రారంభిస్తామని కంపెనీ వివరించింది. పియాజ్జియో తమ ఆప్రిలియా బ్రాండ్‌తో పాటుగా మోటో గుజ్జి మోటార్‌సైకిళ్లను కూడా ఇండియాలోనే అసెంబ్లింగ్ చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
Most Read Articles

English summary
Aprilia, the Piaggio owned Italian performance bike manufacturer, plans to assemble its products in India. Aprilia currently brings its products to India via the CBU route.
Story first published: Tuesday, March 18, 2014, 11:38 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X