మరో రెండు మూడు నెలల్లో 'వెస్పా 946' స్కూటర్ విడుదల
భారత్‌లో తమ 3వ స్కూటర్ 'వెస్పా ఎస్'ను విడుదల చేసిన ఇటాలియన్ బ్రాండ్ పియాజ్జియో, మరికొద్ది నెలల్లోనే తమ లగ్జరీ స్కూటర్ 'వెస్పా 946' (Vespa 946)ను కూడా ఇండియన్ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
వెస్పా ఎస్ స్కూటర్ విడుదల సందర్భంగా పియాజియో వెహికల్స్ చైర్మన్ రవి చోప్రా మాట్లాడుతూ.. భారత్‌లో తమ వ్యాపార విస్తరణ వ్యూహంలో భాగంగా అత్యంత విలాసవంతమైన విస్పా 946 స్కూటర్‌ను ఇక్కడి మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నామని, బహుశా రానున్న రెండుమూడు నెలల్లో ఇవి మార్కెట్‌లోకి అందుబాటులోకి రావచ్చని చెప్పారు.
పియాజ్జియో గడచిన సంవత్సరం జూన్-జులై మధ్య కాలంలో ప్రపంచ మార్కెట్లలో విడుదల చేసిన వెస్పా 946 మోడల్‌ను ఈ ఏడాది ద్వితీయ త్రైమాసికం నాటికి భారత్‌లో కూడా విడుదల చేయనుంది. వెస్పా 946 ఆషామాషీ స్కూటర్ కాదు. ఇది ఈ సెగ్మెంట్లో కెల్లా విశిష్టమైన డిజైన్, ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ లగ్జరీ స్కూటర్‌ను 2011లో జరిగిన మిలాన్ మోటార్ షోలో తొలిసారిగా ఆవిష్కరించారు.
దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను, ఫొటోలు ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

వెస్పా 946 స్కూటర్ డిజైన్ చాలా విశిష్టంగా ఉంటుంది. పైకి తేలినట్టుండే విశాలమైన సీట్ (సింగిల్ సీట్ మాత్రమే), విభిన్నమైన హ్యాండిల్‌బార్, డిజిటల్ డిస్‌ప్లే, ఇటాలియన్ స్టయిల్‌ను ప్రతిభింభింపజేసే బాడీ డిజైన్ ఇంకా మరెన్నో ప్రత్యేకతలు ఈ వెస్పా 946 స్కూటర్ సొంతం.

ఈ స్కూటర్ పూర్తిగా చేతుల్తోనే తయారు చేయబడినది (హ్యాండ్ మేడ్). దీని బాడీ, హ్యాండిల్ బార్, శాడల్ సపోర్ట్, సైడ్ ప్యానెల్స్, ఫ్రంట్ మడ్‌గార్డ్‌లను అల్యూమినియం మూలకాలతో కూడిన ధృడమైన షీట్ స్టీల్‌తో తయారు చేశారు.

వెస్పా 946 లగ్జరీ స్కూటర్‌లో 4 స్ట్రోక్, 125 సీసీ, మోనో సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఎలక్ట్రానిక్ ఫ్యూయెల్ ఇంజెక్షన్, 3 వాల్వ్ డిస్ట్రిబ్యూషన్ ఈ ఇంజన్ సొంతం. ప్రస్తుతం భారత్‌లో లభిస్తున్న వెస్పా స్కూటర్లలో ఉపయోగించిన ఇంజన్ కన్నా ఇది భిన్నమైనది.

ఏబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్, ఏఎస్ఆర్ ఎలక్ట్రానిక్ ట్రాక్షన్ కంట్రోల్, పెద్ద 12 ఇంచ్ వీల్స్, డ్యూయెల్ డిస్క్ బ్రేక్స్‌తో వెస్పా 946 ఈ సెగ్మెంట్లో కెల్లా సురక్షితమైన స్కూటర్‌గా నిలువనుంది.

ఎల్ఈడి హెడ్‌లైట్, ఎల్ఈడి ఇండికేటర్స్ మరియు ఎల్‌సిడి డ్యాష్‌బోర్డ్ వంటి అధునాతన టెక్నాలజీ ఫీచర్లు ఈ స్కూటర్ సొంతం.

పూర్తిగా విదేశాల్లో తయారైన వెస్పా 946 స్కూటర్‌ను (సిబియూ రూట్లో) భారత్‌కు దిగుమతి చేసుకొని ఇక్కడి మార్కెట్లో విక్రయించనున్నారు. ఫలితంగా దీని ధర కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

భారత మార్కెట్లో వెస్పా 946 స్కూటర్ ధరలు రూ.8 లక్షల నుంచి రూ.9 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

పియాజ్జియో వెస్పా స్కూటర్‌ను తొలిసారిగా 1946లో తయారు చేసింది. అందుకే ఈ స్కూటర్‌కు 'వెస్పా 946' (ఆ సంవత్సరంలోని చివరి 3 అంకెలు) అనే పేరును పెట్టారు.

ఈ స్కూటర్ సుదూర ప్రయాణానికే కాకుండా సిటీ డ్రైవింగ్‌కి కూడా అనుకూలంగానే ఉంటుంది.


Click it and Unblock the Notifications








