ఇండియన్ స్కౌట్ బైక్‌ని ఆవిష్కరించిన పోలారిస్; బుకింగ్స్ ప్రారంభం

అమెరికాకు చెందిన ప్రముఖ ఆఫ్-రోడ్, ఆల్-టెర్రైన్ వాహనాల తయారీ సంస్థ పోలారిస్ చేతిలో విక్టరీ, ఇండియన్ వంటి ప్రముఖ మోటార్‌సైకిల్ బ్రాండ్స్ ఉన్న సంగతి తెలిసినదే. ఇటీవలే మనదేశంలో 2014 ఇండియన్ ఛీఫ్ రేంజ్ మోటార్‌సైకిళ్లను ఆవిష్కరించిన పోలారిస్ భారతీయ అనుబంధ సంస్థ పోలారిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, తాజాగా ఇండియన్ బ్రాండ్‌లో మరో సరికొత్త మోడల్‌ను ఆవిష్కరించింది.

ఇది కూడా చదవండి: ఇండియన్ మోటార్ సైకిల్ వేరియంట్లు, ధరలు

'ఇండియన్ స్కౌట్' (Indian Scout) పేరుతో పోలారిస్ ఆవిష్కరించిన సరికొత్త లగ్జరీ బైక్ కోసం కంపెనీ నేటి (ఆగస్ట్ 27, 2014) నుంచే బుకింగ్‌లను స్వీకరిస్తోంది. అమెరికాలో ఈ బైక్ ఇప్పటికే మంచి సక్సెస్‌ను సాధించింది. గత స్మృతులను గుర్తుకు తెచ్చేలా, మోడ్రన్ డిజైన్‌తో ఇండియన్ స్కౌట్ మోటార్‌సైకిల్‌ను డిజైన్ చేశారు. ఈ బైక్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని ఈ కథనంలో తెలుసుకోండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

ఇండియన్ స్కౌట్

పోలారిస్ ఇండియా ఆవిష్కరించిన ఈ సరికొత్త ఇండియన్ స్కౌట్ మోటార్‌సైకిల్ ఓ క్రూజర్ స్టయిల్ బైక్. ఈ బైక్‌లో మొట్టమొదటి సారిగా లిక్విడ్-కూల్డ్ ఇండియన్ మోటార్‌సైకిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇదొక సమర్థవంతమైన మరియు విశ్వసనీయమైన 69 క్యూబిక్ ఇంచ్ వి-ట్విన్ ఇంజన్, ఇది గరిష్టంగా 100 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

ఇండియన్ స్కౌట్

క్లాసిక్ లుక్, మోడ్రన్ టెక్‌తో తయారు చేసిన ఈ కొత్త మోడల్ లెజండ్రీ ఇండియన్ స్కౌట్ పేరును అథెంటిక్ ఇండియన్ మోటార్‌సైకిల్ స్టైల్‌లో కలిగి ఉంటుంది. ఇందులోని హై-పెర్ఫార్మెన్స్ 1131సీసీ, వి-ట్విన్ ఇంజన్ మరో ప్రత్యేక ఆకర్షణ.

ఇండియన్ స్కౌట్

క్లాసిక్ రిగిడ్ ట్రయాంగిల్ డిజైన్, ప్రీమియం మోనోట్యూబ్ రియర్ షాక్స్ మంచి హ్యాండ్లింగ్, కంఫర్ట్‌ను ఆఫర్ చేస్తాయి. దీని బరువు 244 కేజీల నుంచి 253 కేజీల వరకు ఉంటుంది.

ఇండియన్ స్కౌట్

భారత మార్కెట్లో ఈ కొత్త ఇండియన్ స్కౌట్ మోటార్‌సైకిల్ ప్రారంభ ధర రూ.11.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

More from DriveSpark

Article Published On: Wednesday, August 27, 2014, 16:38 [IST]
English summary
After electrifying India by revealing their 2014 Indian Chief range, Polaris India Pvt. Ltd, a wholly owned subsidiary of Polaris Industries Inc., the world leader in Off-Road and All-Terrain Vehicles has announced the availability of the new Indian Scout through bookings with effect from today.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+