విక్టరీ మోటార్‌సైకిళ్లను భారత్‌కు తీసుకురానున్న పోలారిస్
భారత ద్విచక్ర వాహనా మార్కెట్లోకి విదేశీ కంపెనీల నానాటికి అధికమవుతోంది. ఇప్పటికే డ్యుకాటి, బిఎమ్‌డబ్ల్యూ, మోటారాడ్, ఆప్రిలియా, హ్యార్లీ డేవిడ్‌సన్, హ్యోసంగ్, ట్రైయంప్, కవాసకి, కెటిఎమ్ వంటి పలు విదేశీ కంపెనీలు భారత్‌లోకి ప్రవేశించి విజయవంతంగా తమ కార్యకలాపాలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, అమెరికాకు చెందిన మరొక టూవీలర్ బ్రాండ్ ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తుంది.
ప్రముఖ ఆల్-టెర్రైన్ వాహనాల తయారీ కంపెనీ పోలారిస్ ఇండస్ట్రీస్‌కు చెందిన టూవీలర్ బ్రాండ్ 'విక్టరీ మోటార్‌సైకిల్స్' భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది. పోలారిస్ ఇండస్ట్రీస్ గడచిన సంవత్సరం జరిగిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో తమ విక్టరీ మోటార్‌సైకిళ్లను ప్రదర్శనకు ఉంచింది. ఈ ఏడాది చివరి నాటికి ఈ మోటార్‌సైకిళ్లు ఇండియా రోడ్లను తాకవచ్చని తెలుస్తోంది. భారత మార్కెట్లో హ్యార్లీ డేవిడ్‌సన్ బ్రాండ్‌కు ఇది గట్టి పోటీగా నిలువనుంది.
ట్రేడ్‌మార్క్ పొందిన పెద్ద అమెరికన్ వి ట్విన్ ఇంజన్లతో లభ్యం కానున్న ఈ మోటార్‌సైకిళ్లను పోలారిస్ ఇండస్ట్రీస్ ప్రారంభంలో భాగంగా అమెరికా నుండి సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో ఇండియన్ మార్కెట్‌కు దిగుమతి చేసుకొని ఇక్కడి మార్కెట్లో విక్రయించనుంది. భారత్‌లో తొలుతగా విక్టరీ విజన్, విక్టరీ క్రాస్ కంట్రీ మోడళ్లను కంపెనీ విడుదల చేయాలని యోచిస్తోంది. దేశీయ విపణిలో వీటి ధరలు వరుసగా రూ. 11.40 లక్షలు, రూ. 12.21 లక్షలుగా ఉండొచ్చని అంచనా.

Victory Motorcycles
విక్టరీ విజన్ టూర్

Victory Motorcycles
విక్టరీ విజన్ టూర్

Victory Motorcycles

Victory Motorcycles
విక్టరీ క్రాస్ కంట్రీ

Victory Motorcycles
విక్టరీ క్రాస్ కంట్రీ

Victory Motorcycles
విక్టరీ క్రాస్ కంట్రీ

Victory Motorcycles
విక్టరీ క్రాస్ కంట్రీ

Victory Motorcycles

Victory Motorcycles
విక్టరీ క్రాస్ కంట్రీ


Click it and Unblock the Notifications








