బైకర్లను దీవించిన పోప్, కానుకగా హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్‌లు

By Ravi

హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్‌లను రైడ్ చేసే వేలాది మంది అబ్బాయిలు, అమ్మాయిలు తమ బ్రాండ్ 110వ వార్షికోత్సవం సందర్భంగా, సెయింట్ పీటర్స్ స్వేర్‌ వద్ద సమావేశమయ్యారు. వారందరినీ మరియు వారి హ్యార్లీ డేవిడ్‌సన్ మోటార్‌సైకిళ్లను పోప్ ఫ్రాన్సిస్ దీవించి, ఆశీర్వదించారు. ఇందుకు గాను పోప్‌కు సదరు హ్యార్లీ డేవిడ్‌సన్ కంపెనీ రెండు బైక్‌లను కానుకగా ఇచ్చింది.

హ్యార్లీ డేవిడ్‌సన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మార్క్-హాన్స్ రిచర్ ఈ బైక్‌లను పోప్ ఫ్రాన్సిస్‌కు అందజేశారు. పోప్ తన పోప్‌మొబైల్‌ను వదలి, లెథర్ జాకెట్ ధరించి హ్యార్లీ బైక్‌లతో ఫోజులిచ్చారు. హ్యార్లీ డేవిడ్‌సన్ బ్రాండ్ 110వ వార్షికోత్సవ ప్రత్యేక వేడుకల్లో భాగంగా వేలాది మంది హ్యార్లీ డేవిడ్‌సన్ రైడర్లు రోమ్‌కు విచ్చేసి ఇందులో పాల్గొన్నారు.

ఈ వేడుకల్లో భాగంగా, హ్యార్లీ డేవిడ్‌సన్ ప్రముఖ ఆర్టిస్ట్ డేవిడ్ ఉల్‌తో పెయింట్ ఆర్ట్ వర్క్‌ను కూడా ప్రారంభించింది. ఇందులో 1948 ఎఫ్ఎల్ పాన్‌హెడ్ మోడల్ కూడా ఉంది. శాన్ పీటెరో స్క్వేర్‌లో పార్క్ చేసిన ఈ బైక్‌ను ప్రీస్ట్ ప్రశంసించడాన్ని చిత్రంలో చూడొచ్చు. ఈ లిమిటెడ్ ఎడిషన్ ఆర్ట్‌‌వర్క్‌ను పోస్ట్ కార్డ్ ఫార్మట్లతో పాటు అనేక ఎడిషన్లలో విడుదల చేయనున్నారు.

పోప్‌కు రెండు హ్యార్లీ బైక్‌లు
లిమిటెడ్ ఎడిషన్ ఆర్ట్‌‌వర్క్‌
లిమిటెడ్ ఎడిషన్ ఆర్ట్‌‌వర్క్‌
1948 ఎఫ్ఎల్ పాన్‌హెడ్

More from DriveSpark

Article Published On: Monday, June 17, 2013, 10:51 [IST]
English summary
Thousands of ‘Bad Boys' & girls riding Harley Davidson motorcycles gathered at St Peter's Square on occasion of the brand's 110th anniversary, where Pope Francis himself blessed the harley Davidson motorcycles and their riders. What's more, the Pope even received a biker leather jacket and two Harley Davidsons from Mark-Hans Richer, Harley-Davidson's senior vice-president.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+