పోర్షే కారును కొనలేరా..? అయితే, ఈ పోర్షే సైకిల్‌ను కొనుక్కోండి

అత్యంత ఖరీదైన మరియు విలాసవంతమైన పోర్షే కారును సొంతం చేసుకోవాలని ఎవ్వరికైనా ఆశ ఉంటుంది. అయితే, ఇది అందరికీ సాధ్యమైనది కాదు. అందుకే, పోర్షే తమ బ్రాండ్ అంటే ఇష్టపడే వారి కోసం రెండు సరికొత్త సైకిళ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.

పోర్షే బైక్ ఆర్ఎక్స్, పోర్షే బైక్ ఆర్ఎస్ మరియు పోర్షే బైక్ అనే మూడు లగ్జరీ సైకిళ్లను పోర్షే తయారు చేసింది. పోర్షే అందిస్తున్న పవర్‌‌ఫుల్ స్పోర్ట్స్ కార్ల నుంచి స్ఫూర్తి పొంది ఈ సైకిళ్లను తయారు చేశారు. ఇప్పటికే ఆస్టన్ మార్టిన్ వంటి పలు లగ్జరీ కార్ కంపెనీలు కూడా ఈ తరహా సైకిళ్లను ఆఫర్ చేస్తున్న సంగతి తెలిసినదే.

పోర్షే బ్రాండెడ్ సైకిళ్లకు సంబంధించిన మరింత సమాచారాన్ని ఈ ఫొటో ఫీచర్‌‌లో పరిశీలించండి.

పోర్షే సైకిల్‌

పోర్షే కార్ల డిజైన్‌ను దృష్టిలో ఉంచుకొని ఆ పోర్షే సైకిళ్లను డిజైన్ చేశారు. పోర్షే కారు వెనుక భాగాన్ని తలపించేలా వంపుతో ఉండే ఫ్రేమ్‌ను ఇందులో గమనించవచ్చు.

పోర్షే సైకిల్‌

పోర్షే బైక్ ఒక సిటీ బైస్కిల్ లాంటింది. ఇది షిమానో ఆల్ఫైన్ 8-స్పీడ్ హబ్ గేర్ అసెంబ్లీతో మరియు మగురా నుంచి గ్రహించిన ఎమ్‌టి26 డిస్క్ బ్రేక్స్ ఫీచర్లతో లభిస్తుంది.

పోర్షే సైకిల్‌

పోర్షే బైక్ ధర 2650 యూరోలు (మన దేశ కరెన్సీలో సుమారు రూ.2.2 లక్షలు). పోర్షే అందించనున్న మూడు సైకిళ్లలో ఇదే చవకైనది.

పోర్షే బైక్ ఆర్ఎక్స్

పోర్షే బైక్ ఆర్ఎక్స్

పోర్షే బైక్ ఆర్ఎక్స్ ఒక ఆఫ్ రోడింగ్ సైకిల్. కార్భన్ ఫైబర్ ఫ్రేమ్‌తో తయారు చేయబడిన ఈ సైకిల్ మంచి స్టెబిలిటీని మరియు డ్యాంపింగ్‌ను కలిగి ఉంటుంది. ఇది 20-స్పీడ్ షిమానో గేర్ హబ్‌తో లభిస్తుంది.

పోర్షే సైకిల్‌

పోర్షే బైక్ ఆర్ఎక్స్ చక్రాలు 27.2 ఇంచ్ సైజును కలిగి ఉంటాయి. ఇందులో ముందు వైపు డిటి స్విస్ ఎయిర్-సస్పెన్షన్ ఫ్రంట్ ఫోర్క్స్, హైడ్రాలిక్ డిస్క్ బ్రేక్స్ ప్రధానంగా చెప్పుకోదగిన ఫీచర్లు.

పోర్షే సైకిల్‌

జర్మనీలో పోర్షే బైక్ ఆర్ఎక్స్ ధర 4800 యూరోలు (మన దేశ కరెన్సీలో సుమారు రూ.4.09 లక్షలు).

పోర్షే బైక్ ఆర్ఎస్

పోర్షే బైక్ ఆర్ఎస్

పోర్షే బైక్ ఆర్ఎస్ ఒక స్పోర్టీ సిటీ బైక్. ఇది కూడా కార్భన్ ఫైబర్ ఫ్రేమ్‌తో తయారు చేయబడినది. ఇది చాలా తేలికగా ఉంటుంది. దీని మొత్తం బరువు కేవలం 9 కిలోలు మాత్రమే. ఈ మూడు సైకిళ్లలో కెల్లా ఇదే అత్యంత తేలికనైది.

పోర్షే సైకిల్‌

ఇందులో కూడా 20-స్పీడ్ షిమానో గేర్ సిస్టమ్‌ను అందుబాటులో ఉంచారు. మగురా నుంచి గ్రహించిన ఆల్ట్రా లైట్ వెయిట్ డిస్క్ బ్రేక్స్ ఇందులో మరో ఆకర్షణగా చెప్పుకోవచ్చు.

పోర్షే సైకిల్‌

పోర్షే బైక్ ఆర్ఎస్ ధర 5900 యూరోలు (మనదేశ కరెన్సీలో సుమారు రూ.5.03 లక్షలు).

పోర్షే సైకిల్‌

ఈ పోర్షే లగ్జరీ సైకిళ్లు కాస్తంత అధిక ధర కలిగి ఉన్నప్పటికీ, ఇవి మాత్రం ధరకు తగిన విలువను ఆఫర్ చేస్తాయని కంపెనీ చెబుతోంది.

More from DriveSpark

Article Published On: Tuesday, March 4, 2014, 16:04 [IST]
English summary
For Porsche owners, enthusiasts and anyone who wants to own a Porsche branded vehicle, the German automaker has come out with a trio of high-end, ultra light weight luxury bicycles - Porsche Bike RX, Porsche Bike RS and Porsche Bike.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+