డ్యుకాటి స్క్రాంబ్లర్ మోటార్‌‌సైకిల్ ఉత్పత్తి ప్రారంభం

ఇటాలియన్ మోటార్‌సైకిల్ కంపెనీ డ్యుకాటి, గడచిన నవంబర్ నెలలో జరిగిన 2014 ఈఐసిఎమ్ఏ షోలో ఆవిష్కరించిన స్క్రాంబ్లర్ మోటార్‌సైకిల్ ఇప్పుడు ఉత్పత్తి దశకు చేరుకుంది. డ్యుకాటి సుమారు 40 ఏళ్ల క్రితం స్క్రాంబ్లర్ మోటార్‌సైకిళ్లను తయారు చేయటం నిలిపి వేసింది. ఆ తర్వాత ఇన్నాళ్లకు తిరిగి స్క్రాంబ్లర్‌ను తయారు చేసింది.

డ్యుకాటి ఇంజనీర్లు స్క్రాంబ్లర్ ప్రాజెక్టును చేపట్టిన కేవలం ఆరు నెలల్లోనే ఇది ఉత్పత్తి దశకు చేరుకోవటం విశేషం. ఇది 2014 ఈఐసిఎమ్ఏ షోలోఅత్యంత సుందరమైన బైక్ అవార్డును దక్కించుకుని అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఇటాలియన్ మ్యాగజైన్ మోటోసిస్లిమో ప్రతి ఏటా నిర్వహించినట్లుగానే ఈ ఏడాది కూడా నిర్వహించిన పోల్‌లో దాదాపు 43 శాతం మంది (10,000 మందికి పైగా) అభిమానులు ఈ క్లాసిక్ ఇటాలియన్ మోటార్‌సైకిల్‌కు నేరుగా మరియు వెబ్‌సైట్ ద్వారా ఓట్ వేశారు. ఈ ఓటింగ్‌‌లో ఇది అధిక రేటింగ్‌ను దక్కించుకుంది.

బైకర్ బైకింగ్ గ్లౌజ్ రూ.350ల నుంచి ప్రారంభం, త్వరపడండి!

దాదాపు 40 ఏళ్ల తర్వాత వస్తున్న తొలి డ్యుకాటి స్క్రాంబ్లర్ బైక్‌ను ఇటలీలోని బోర్గో పనిగేల్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తున్నారు. ఈ కొత్త డ్యుకాటి స్క్రాంబ్లర్ మోటార్‌సైకిల్ వచ్చే ఏడాది జనవరి నుంచి కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. ఈ బైక్‌లో ఎయిర్-కూల్డ్, ట్విన్-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 75 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

Ducati Scrambler Production Begins

More from DriveSpark

Article Published On: Friday, December 5, 2014, 11:18 [IST]
English summary
Italian motorcycle manufacturer Ducati, has started manufacturing one of their most awaited motorcycles, the Scrambler. In just six months time since the project was presented to Ducati employees, the motorcycle production has begun.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+