రాజ్‌పుతన కస్టమ్స్ నుంచి కస్టమైజ్డ్ హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ 750
ఆటో ఎక్స్‌పో 2014, ఇండియా బైక్ వీక్ 2014లలో స్ట్రీట్ కస్టమ్ కాన్సెప్ట్స్ బైక్స్‌ని ప్రదర్శించిన, జైపూర్‌కి చెందిన మోటార్‌సైకిల్ కస్టమైజేషన్ హౌస్ 'రాజ్‌పుతన కస్టమ్స్' (Rajputana Customs) వచ్చే నెలలో జరగనున్న హ్యార్లీ రాక్ రైడర్స్ - సీజన్ 5లో, ఇండియన్ బైక్ ప్రియుల కోసం మరో ఆకర్షనీయమైన కస్టమ్ కాన్సెప్ట్‌ను ప్రదర్శనకు ఉంచనుంది.
హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ 750 మోటార్‌సైకిల్‌ని ఆధారంగా చేసుకొని తయారు చేసిన ఓ కస్టమైజ్డ్ బైక్‌ని కంపెనీ ప్రదర్శించనున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఆటో ఎక్స్‌పో 2014లో హ్యార్లీ డేవిడ్‌సన్ ఆవిష్కరించిన స్ట్రీట్ 750, ఓ ప్యూర్, లిక్విడ్-కూల్డ్ బైక్. ఈ బైక్ కోసం కంపెనీ అనేక రకాల కస్టమైజేషన్ ఆప్షన్‌లు కూడా అందుబాటులో ఉంచింది.

పాపులర్ స్ట్రీట్ 750 మోడల్‌ను ఆధారంగా చేసుకొని తయారు చేసిన ఆర్గానిక్ అండ్ ఓల్డ్-స్కూల్ ఇన్‌స్పైర్డ్ కస్టమర్ వెర్షన్ బైక్‌ను వచ్చే నెలలో ప్రదర్శిస్తామని రాజ్‌పుతన కస్టమ్స్ తెలిపింది. రాజ్‌పుతన కస్టమ్స్ అధినేత విజయ్ సింగ్‌కు హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్‌లను కస్టమైజ్ చేయటం ఇదే మొదటి సారి కాదు.
గతంలో విజయ్ సింగ్ హ్యార్లీ డేవిడ్‌సన్ ఫోర్టీ ఎయిట్, హ్యార్లీ డేవిడ్‌సన్ ఐరన్ 883 మోడళ్లను ఆధారంగా చేసుకొని రెండు బైక్‌లను కస్టమైజ్ చేశారు. ఈ ఫొటోలలో చూడొచ్చు [మొదటి ఫొటోలో ఉన్నది జోర్డార్ (హ్యార్లీ డేవిడ్‌సన్ 883 ఆధారంగా తయారు చేశారు) రెండవ ఫొటోలో ఉన్నది రాజ్‌మాత (హ్యార్లీ డేవిడ్‌సన్ ఫోర్టీ ఎయిట్ మోడల్ ఆధారంగా తయారు చేశారు)].

విజయ్ సింగ్ తయారు చేసిన తొలి కస్టమైజ్డ్ బైక్ 'ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్'ను 2010 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించారు. ఆ తర్వాత జాన్ అబ్రహామ్ కోసం లైట్‌ఫుట్ అనే కస్టమైజ్డ్ బైక్‌ను తయారు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజ్‌పుతన కస్టమ్స్ డజనుకు పైగా పాపులర్ కస్టమైజ్డ్ బైక్‌లను తయారు చేసింది. కస్టమ్ రాయల్ ఎన్‌ఫీల్డ్, చోపర్, బాబర్, కెఫే రేసర్ స్టైల్ కస్టమ్ బైక్స్‌ను వీరు తయారు చేశారు. అంతేకాకుండా, పురాతన క్లాసిక్ మోటార్‌సైకిళ్లను రిస్టోరింగ్ చేయటం కూడా రాజ్‌పుతన కస్టమ్స్‌కు వెన్నతో పెట్టిన విద్య.


Click it and Unblock the Notifications








