ఆటో ఎక్స్‌పోలో నమన్ చోప్రా 'రెక్స్‌నమో' ఎలక్ట్రిక్ క్రూజర్ బైక్

By Ravi

సాధారణంగా ఆటో ఎక్స్‌పో వంటి పెద్ద మోటార్ షోలలో బ్రాండ్ ఇమేజ్ ఉన్న కంపెనీలకే ఎక్కువ ప్రధాన్యత లభిస్తుంది. కానీ, ఆయా బ్రాండెడ్ కంపెనీలకు మించి, సాంకేతికపరంగా అధునాతమైన ఉత్పత్తులను తయారు చేసే చిన్ని కంపెనీలు ప్రధానంగా ఎవ్వరి దృష్టిని ఆకర్షించవు. అలాంటి ఓ చిన్న కంపెనీని మా డ్రైవ్‌స్పార్క్ బృందం ప్రత్యేకంగా కలవడం జరిగింది. ఆ ఉత్పత్తేంటో, దాని విశేషాలేంటో తెలుసుకుందాం రండి..!

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన 'రెక్స్‌నమో' (Rexnamo) కంపెనీ సీఆఓ నమన్ చోప్రా ఓ మేడ్ ఇండియా ఎలక్ట్రిక్ క్రూజర్ బైక్‌ను అభివృద్ధి చేశారు. దాదాపు పూర్తిగా దేశీయ టెక్నాలజీతో తయారు చేసిన ఈ ఎలక్ట్రిక్ క్రూజర్ సాధారణ ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌ల మాదిరిగా కాకుండా, అత్యధిక పెర్ఫామెన్స్‌ను మరియు రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది. నమన్ చోప్రా తన 14వ ఏట నుంచి తన తండ్రితో కలిసి రెగ్యులర్ మోటార్‌సైకిళ్లను తయారు చేసేవాడు.


కాగా.. నమన్ చోప్రా తొలిసారిగా తయారు చేసిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ మాత్రం ఇదే. ఇదొక ప్రోటోటైప్ బైక్. ఇందులో ప్రొడక్షన్ వెర్షన్ 2015-16 నాటికి సిద్ధం కానుంది. ఈ క్రూజర్‌ను దాదాపు 80 శాతం వరకు లోకలైజేషన్‌తో ఇండియాలోనే తయారు చేయనున్నారు. అయితే, ఇందులో బ్యాటరీ వంటి కీల భాగాలను మాత్రం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ ఎలక్ట్రిక్ క్రూజర్ బైక్‌ను లగ్జరీ బైక్ సెగ్మెంట్లో ప్రవేశపెట్టనున్నారు. దీని ధర సుమారు మూడు లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఈ ధర కొంచెం ఎక్కువే అయినప్పటికీ, ఇది ధరకు తగిన విలువను కలిగి ఉంటుందని నమన్ చోప్రా చెబుతున్నాడు. ఈ క్రూజర్ బైక్‌లను పూర్తిగా చేతుల్తో తయారు చేస్తారు. దీని గరిష్ట వేగం గంటకు 130 కి.మీ. బ్యాటరీని పూర్తి చార్జ్ చేస్తే 200 కి.మీ. దూరం వరకూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించవచ్చు.

Rexnamo By Naman Chopra

ఈ క్రూజర్ బైక్‌తో పాటు కొనుగోలు చేసే బ్యాటరీ జీవితకాలం 10 సంవత్సరాలు. ఈ బ్యాటరీని చార్జ్ చేయటానికి పట్టే సమయం కేవలం 3 గంటలు మాత్రమే. రెక్స్‌నమో తమ క్రూజర్ బైక్‌ను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లకు పెయింట్, డెకాల్స్ మొదలైన కస్టమైజేషన్ ఆప్షన్లను అందుబాటులో ఉంచుతుంది. వినియోగదారులు తమ అభిరుచికి తగినట్లుగా ఈ బైక్‌ను కస్టమైజ్ చేసుకోవచ్చు.

రెక్స్‌నమో గురించి మరింత తెలుసుకునేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి

ఫేస్‌బుక్‌లో నమన్ చోప్రాతో కనెక్ట్ అయ్యేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Most Read Articles

English summary
Among many international and national manufacturers, around the corner of the Auto Expo was a local company called Rexnamo. The company has developed an electric Cruiser which will deliver high performance as well as long range.
Story first published: Thursday, February 13, 2014, 18:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X